షాకింగ్.. ఏపీ రాజ్‌భవన్‌లో నలుగురికి కరోనా..!
ఏపీలో కరోనా కేసుల విజృంభణ ఆగడం లేదు. తాజాగా రాజ్‌భవన్‌లో నలుగురికి కరోనా పాజిటివ్ సోకినట్లు తేలింది. ఒక సెక్యూరిటీ ఆఫీసర్, ఒక స్టాఫ్ నర్స్, మరో ఇద్దరు అటెండర్‌లకు

ఏపీలో కరోనా కేసుల విజృంభణ ఆగడం లేదు. తాజాగా రాజ్‌భవన్‌లో నలుగురికి కరోనా పాజిటివ్ సోకినట్లు తేలింది. ఒక సెక్యూరిటీ ఆఫీసర్, ఒక స్టాఫ్ నర్స్, మరో ఇద్దరు అటెండర్‌లకు కరోనా వచ్చినట్లు వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి అన్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తో సహా అందరికీ టెస్ట్ లు నిర్వహించామని, మరెవరికీ కరోనా సొకలేదని ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలోనే అత్యధికంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని, అందుకే పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని అన్నారు. ఏపీలో ఇప్పటి వరకు 80,334 శాంపిళ్లను పరీక్షించామని.. పాజిటివ్ శాతం 1.57 మాత్రమే ఉందని తెలిపారు. కొత్త కేసులన్నీ కరోనా క్లస్టర్సులోనే వస్తున్నాయని జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. మైల్డ్ సింప్టమ్స్ ఉన్న వారికి హోం ఐసోలేషనులో ఉండేందుకు కేంద్రం అంగీకరించిందని.. హోం ఐసోలేషన్ కుదరని వారు కోవిడ్ కేర్ సెంటర్లకు రావచ్చని ఆయన సూచించారు. నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో కొత్త వైరలాజీ ల్యాబులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా జవహర్ రెడ్డి వివరించారు. కాగా ఏపీలో 1,259 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Read This Story Also: వీడియో విడుదల చేసిన పెంటగాన్ .. ఏలియన్స్ భూమ్మీదకు వచ్చేశారా..!