ఢిల్లీ.. పాక్షికంగా ఆంక్షల సడలింపు.. మే 3 అనంతరం సమగ్ర కార్యాచరణ
ఢిల్లీ ప్రభుత్వం మనలవరం పాక్షికంగా ఆంక్షలు సడలించింది. ఎలెక్ట్రిషియన్లు, ప్లంబర్లు, మోటార్ మెకానిక్కులు ఇక మళ్ళీ తమ విధులకు హాజరు కావచ్ఛునని స్పష్టం చేసింది. వీరితో బాటు కార్పెంటర్లకు కూడా వెసులుబాటు లభించనుంది. అయితే లాక్ డౌన్ పై ప్రభుత్వం తన యోచనను ప్రకటించలేదు. మే 3 తరువాత తమ ప్రభుత్వం కార్యాచరణను ప్రకటిస్తుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. స్వయం ఉపాధితో జీవనం నెట్టుకొస్తున్న యువతకోసం ఆంక్షలను సడలించామని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా.. లాక్ […]

ఢిల్లీ ప్రభుత్వం మనలవరం పాక్షికంగా ఆంక్షలు సడలించింది. ఎలెక్ట్రిషియన్లు, ప్లంబర్లు, మోటార్ మెకానిక్కులు ఇక మళ్ళీ తమ విధులకు హాజరు కావచ్ఛునని స్పష్టం చేసింది. వీరితో బాటు కార్పెంటర్లకు కూడా వెసులుబాటు లభించనుంది. అయితే లాక్ డౌన్ పై ప్రభుత్వం తన యోచనను ప్రకటించలేదు. మే 3 తరువాత తమ ప్రభుత్వం కార్యాచరణను ప్రకటిస్తుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. స్వయం ఉపాధితో జీవనం నెట్టుకొస్తున్న యువతకోసం ఆంక్షలను సడలించామని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా.. లాక్ డౌన్ అమలులో ఉండగా హాట్ జోన్ గా పరిగణించిన సదర్ బజార్ లో తన మందీ మార్బలంతో ఆర్భాటంగా కార్లలో తిరిగిన ఆహార శాఖ మంత్రి హుసేన్ విషయంలో ఎలాంటి చర్య తీసుకోవాలోనని ఆప్ పార్టీ యోచిస్తోంది. తనను అడ్డుకున్న పోలీసులతో ఆయన వాగ్యుధ్ధానికి దిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఆప్ అధిష్టానం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.