మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌కి క‌రోనా పాజిటివ్‌

సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు, మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరున్ కుమార్‌కి కోవిడ్ పాజిటివ్ నిర్థార‌ణ అయింది. రెండు రోజులుగా జ్వ‌రంతో బాధ‌ప‌డుతోన్న ఆయ‌న క‌రోనా ప‌రీక్ష‌లు చేసుకోగా.. కోవిడ్ సోకిన‌ట్టు రిపోర్టుల్లో తేలింది. దీంతో రాజ‌మండ్రిలోని త‌న నివాసంలో హోం ఐసోలేష‌న్‌కి..

మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌కి క‌రోనా పాజిటివ్‌

Edited By:

Updated on: Aug 26, 2020 | 9:24 PM

ఆంధ్ర ప్ర‌దేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభణ కొన‌సాగుతూనే ఉంది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,82,469కి చేరుకోగా, ఇప్ప‌టివ‌ర‌కూ 3,541 మంది క‌రోనా బారిన ప‌డి ప్రాణాలు కోల్పోయారు. వీఐపీల‌ను సైతం వ‌ద‌ల‌డం లేదు ఈ క‌రోనా. కాగా ఇప్ప‌టికే ఏపీలో ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేత‌లు, అధికారులు ఈ వైర‌స్ బారిన ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. తాజ‌గా సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు, మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరున్ కుమార్‌కి కోవిడ్ పాజిటివ్ నిర్థార‌ణ అయింది. రెండు రోజులుగా జ్వ‌రంతో బాధ‌ప‌డుతోన్న ఆయ‌న క‌రోనా ప‌రీక్ష‌లు చేసుకోగా.. కోవిడ్ సోకిన‌ట్టు రిపోర్టుల్లో తేలింది. దీంతో రాజ‌మండ్రిలోని త‌న నివాసంలో హోం ఐసోలేష‌న్‌కి వెళ్లిపోయారు ఉండ‌వ‌ల్లి. ఇక గ‌త వారం రోజులుగా త‌న‌తో స‌న్నిహితంగా ఉన్న నేత‌లు, కార్య‌క‌ర్త‌లు కూడా క‌రోనా టెస్టులు చేయించుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

Read More:

క‌రోనా ఎఫెక్ట్ః ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ

సూర్యని కావాలనే కొంతమంది టార్గెట్ చేస్తున్నారుః భార‌తీరాజా

డీప్ కోమాలోనే ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీః ఆర్మీ ఆస్ప‌త్రి వైద్యులు