క‌రోనా ఎఫెక్ట్ః ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ

ఈ మ‌హమ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే ఈ రాష్ట్రంలో వారానికి రెండు రోజుల పాటు ష‌ట్‌డౌన్ కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఈ ష‌ట్‌డౌన్‌ను సెప్టెంబ‌ర్ 17వ తేదీ వ‌ర‌కు కొన‌సాగించ‌నున్న‌ట్లు..

క‌రోనా ఎఫెక్ట్ః ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ
Follow us

| Edited By:

Updated on: Aug 26, 2020 | 8:39 PM

భార‌త‌ దేశ‌ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. రోజూ కొత్త‌గా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్ప‌టికే ప‌లువురు సినీ, రాజ‌కీయ‌ ప్ర‌ముఖులు, పోలీసులు, వైద్యులు ఈ వైర‌స్ బారిన ప‌డుతోన్న‌ విష‌యం తెలిసిందే. ఈ మ‌హమ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే ఈ రాష్ట్రంలో వారానికి రెండు రోజుల పాటు ష‌ట్‌డౌన్ కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఈ ష‌ట్‌డౌన్‌ను సెప్టెంబ‌ర్ 17వ తేదీ వ‌ర‌కు కొన‌సాగించ‌నున్న‌ట్లు సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ పేర్కొన్నారు. ఇక ఆగ‌ష్టు 27, 31 తేదీల్లో, సెప్టెంబ‌ర్ 7, 11, 12 తేదీల్లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంటుంద‌న్నారు.

ఇక మ‌రోవైపు స్కూళ్లు, కాలేజీలు స‌హా విద్యా సంస్థ‌ల‌న్నీ సెప్టెంబ‌ర్ 20వ తేదీ వ‌ర‌కు మూసివేసి ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ స్ప‌ష్టం చేశారు. అలాగే విమానాల రాక‌పోక‌ల‌పై ఉన్న నిషేధాన్ని కూడా ఎత్తివేసే ఆలోచ‌న ఉంద‌ని, వారంలో మూడు రోజులు విమానాల రాక‌పోక‌ల‌ను పున‌రుద్ధ‌రించాల‌నే ప్లాన్ ఉంద‌న్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను మాత్ర‌మే లాక్‌డౌన్‌లో అనుమ‌తిస్తామ‌న్నారు. మిగ‌తా అన్ని దుకాణాల‌న్నీ వారంలో రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా మూసివేయ‌బ‌డ‌తాయి. స్కూళ్లు, కాలేజీలు, యూనివ‌ర్మిటీలు స‌హా విద్యా సంస్థ‌లు సెప్టెంబ‌ర్ 20 వ‌ర‌కు మూసివేయ‌బ‌డ‌తాయ‌ని సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌క‌టించారు.

Read More:

సూర్యని కావాలనే కొంతమంది టార్గెట్ చేస్తున్నారుః భార‌తీరాజా

డీప్ కోమాలోనే ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీః ఆర్మీ ఆస్ప‌త్రి వైద్యులు

బ్రేకింగ్ః తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డికి కోవిడ్ పాజిటివ్

ఆ ప్ర‌భుత్వ‌ ఉద్యోగులకు సీఎం జ‌గ‌న్‌ గుడ్ న్యూస్‌