కరోనా మహమ్మారి సృష్టిస్తోన్న చేస్తోన్న కష్టాలు అన్నీ, ఇన్నీ కావు. మనసును కదిలించే ఘటనలు ఈ కోవిడ్ వ్యాప్తి సమయంలో అనేకం చూశాం. తాజాగా గుంటూరు నగరంలో నివసించే ఓ కుటుంబంలో కల్లోలం రేపింది. 20 రోజుల వ్యవధిలో ఐదుగురిని మహమ్మారి బలి తీసుకోగా… ఆ కుటుంబంలో మిగిలినవారు తీవ్ర ఆక్రందనలో ఉన్నారు. టీచర్ గా పనిచేసి రిటైర్ మహ్మద్ ఫరుద్దీన్ షా… కుటుంబంతో సహా A.T.అగ్రహారంలోని శ్రీరామనగర్‌లో నివసించేవారు. కుమార్తెకు, ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లు చేశారు. ఉన్నంతలో సర్దుకుపోయి.. కలిసిమెలసి ఆనందంగా జీవించే ఆ కుటుంబాన్ని..కరోనా కోలుకోలేని రీతిలో దెబ్బతీసింది.
గత నెల 4వ తేదీ నుంచి 29 మధ్య ఫరుద్దీన్‌తోపాటు ఆయన కుమార్తె, తల్లి, కుమారుడు, భార్య వరుసగా కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు. మరణించిన ఏ ఒక్కరూ మరొకరి మృతి గురించి తెలియకుండానే కన్నుమూయడం.. మనసులను మెలిపెట్టే విషయం. ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో చెబితే మరింత ప్రమాదమని…వారికి విషయం తెలియజేయలేదు.ప్రస్తుతం ఫరుద్దీన్ చిన్న కుమారుడు జిలానీ కుటుంబం, వదిన గౌసియా, ఆమె పిల్లలు తీవ్ర మనోవేధనలో ఉన్నారు. కుటుంబంలో కరోనా రేపిన కల్లోలాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వైద్య ఖర్చుల కోసం రూ. 20 లక్షల వరకూ అప్పు చేశారు. పుట్టెడు కష్టంలో ఉన్న తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
Also Read: తెలంగాణలో రేపట్నుంచే లాక్ డౌన్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం