Coronavirus in telangana: తెలంగాణలోని ఆ ప్రాంతంలో మాస్క్ లేదంటే ఫైన్ పడ్డట్టే…

|

Mar 24, 2021 | 9:52 PM

గత ఏడాది కాలంగా కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ రెండో విడత విజృంభిస్తోంది. గత కొద్దిరోజులుగా క్రమంగా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో...

Coronavirus in telangana:  తెలంగాణలోని ఆ ప్రాంతంలో మాస్క్ లేదంటే ఫైన్ పడ్డట్టే...
ప్రతీకాత్మక చిత్రం
Follow us on

No Mask Fine: గత ఏడాది కాలంగా కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ రెండో విడత విజృంభిస్తోంది. గత కొద్దిరోజులుగా క్రమంగా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో అధికార యంత్రాంగంతో పాటు సామాన్య ప్రజల్లోనూ ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే మెదక్‌ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో కరోనా నివారణ కోసం కట్టుదిట్టమైన నిబంధనలు అమలు చేస్తున్నారు.

కేంద్రప్రభుత్వం మున్సిపాలిటీలకు కరోనా కట్టడికి అనుమతులు మంజూరు చేయడంతో మున్సిపల్‌ పాలకవర్గం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. రామాయంపేట మున్సిపాలిటీలో కరోనా పాజిటివ్‌ కేసులు సుమారు 10కి చేరాయి. వారంతో హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. కరోనా తీవ్ర నేపథ్యంలో..కట్టడి చర్యలు చేపట్టారు.

మార్చ్‌ 25 నుంచి మున్సిపాలిటీ పరిధిలో మాస్కులు లేకుండా సంచరిస్తే.. వంద రూపాయలు, వ్యాపార సంస్థల్లో మాస్క్‌ లేనివారికి వెయ్యి రూపాయలు ఫైన్‌ విధించాలని నిర్ణయించారు. అందరూ తప్పని సరిగా ఆంక్షలు పాటించాలని సూచించారు. అయినా రెండోసారి కూడా మాస్క్‌ లేకుండా కనిపిస్తే… 500 జరిమానా, వ్యాపార సంస్థలకు 5 వేలు, మూడవ సారి మాస్క్‌ లేకుండా పట్టుబడితే.. వ్యాపార సంస్థలకు శాశ్వతంగా లైసెన్సులు రద్దు చేయనున్నట్లు మున్సిపల్‌ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్‌ తెలిపారు.

కాగా కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు శానిటైజర్‌తో చేతులు శుభ్రపరుచుకోవాలని.. జాగ్రత్తలు పాటించని పక్షంలో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు.

Also Read: తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా.. ప్రకటించిన ఉన్నత విద్యామండలి

ఆంధ్రప్రదేశ్‌లో‌ ఒంటి పూట బడులు, వేసవి సెలవులు… పూర్తి షెడ్యూల్ ఇదే…