
Fine For Not Wearing Mask: ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా ఉంది. ముఖ్యంగా మెల్‌బోర్న్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో ప్రజలందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని అధికార యంత్రాంగం నిబంధనను విధించింది. ప్రస్తుతం మెల్‌బోర్న్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా లాక్ డౌన్ కొనసాగుతోంది. మిచెల్ షైర్‌లో ఉంటున్నవారు అందరూ కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని.. ఒకవేళ నిబంధనను ఎవరైనా అతిక్రమిస్తే $ 200 ( భారత కరెన్సీ ప్రకారం రూ.15వేలు) జరిమానా విధిస్తామని ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్ తెలిపారు. కాగా, ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 11,802 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 122 మంది మృతి చెందారు.
Also Read:
సుశాంత్ ఆత్మతో కబుర్లు.. మరిన్ని అనుమానాలు.. వైరలవుతున్న మరో వీడియో..
తెలంగాణలో కరోనా చికిత్స అందించే ఆసుపత్రులు ఇవే..
సచివాలయాల ద్వారా ఇకపై పేదలకు ఉచితంగా ఇసుక..
సామాన్యులకు షాక్.. పెరిగిన బియ్యం ధరలు..
2.5 కోట్ల ఇరానీయులకు కరోనా.. దేశాధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..