Coronavirus: దేశంలో కరోనా మరణాలు 32- 37 లక్షలంటూ కథనాలు.. కేంద్రం ఏమంటోందంటే..

Covid deaths in India: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని బలితీసుకుంది కరోనా మహమ్మారి (Covid 19). ఇండియాలోనూ లక్షలాది మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

Coronavirus: దేశంలో కరోనా మరణాలు 32- 37 లక్షలంటూ కథనాలు.. కేంద్రం ఏమంటోందంటే..
Covid Deaths

Updated on: Feb 17, 2022 | 9:56 PM

Covid deaths in India: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని బలితీసుకుంది కరోనా మహమ్మారి (Covid 19). ఇండియాలోనూ లక్షలాది మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొదటి వేవ్‌లో మరణాలు అదుపులోనే ఉన్నా రెండో వేవ్‌లో మాత్రం రోజూ వేలాదిమంది ఈ మహమ్మారికి బలయ్యారు. ఒమిక్రాన్‌ అంటూ మూడో వేవ్‌లోనూ ముచ్చెమటలు పట్టించినా మరణాలు (Covid Deaths)  మాత్రం పెరగలేదు. చాలామంది కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం, మెరుగైన వైద్య సదుపాయాలు కరోనా మరణాలకు అడ్డుకట్ట వేశాయని చెప్పవచ్చు. కాగా దేశంలో ఇప్పటివరకు (ఫిబ్రవరి 17) 5,10,413 మంది ప్రాణాలో కోల్పోయారని కేంద్ర వైద్యా రోగ్య శాఖ వెల్లడించింది. అయితే మన దేశంలో కరోనా మరణాలు అధికారిక లెక్కల కంటే ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయంటూ అంతర్జాతీయ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా సెకండ్‌ వేవ్‌ సమయంలో అధికారిక మరణాల కంటే ఇంకా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారంటూ పలు అంతర్జాతీయ నివేదికలు వెలువడ్డాయి. కాగ కరోనా మరణాలపై అంతర్జాతీయ మీడియాలో వస్తోన్న కథనాలను, నివేదికలపై కేంద్రం స్పందించింది. ఆ కథనాలు, నివేదికలన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేసింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

అవన్నీ ఊహాజనిత లెక్కలు..

‘ నవంబర్‌ 2021 నాటికే దేశంలో కొవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 32 నుంచి 37 లక్షల మధ్య ఉండవచ్చని ఇటీవల కొన్ని నివేదికలు వచ్చాయి. వీటికి ఎటువంటి ఆధారాలు లేవు. కేవలం ఊహజనిత లెక్కలు మాత్రమే. కరోనా మరణాలను లెక్కించేందుకు దేశంలో పటిష్ఠమైన వ్యవస్థ అందుబాటులో ఉంది. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి రాష్ట్ర స్ధాయి వరకు సమాచార సేకరణ వ్యవస్ధ అందుబాటులో ఉంది. మరణాలను పారదర్శక విధానంలోనే నమోదు చేస్తున్నాం. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమాచారాన్ని స్వతంత్రంగా అందించిన తర్వాత కేంద్రం నమోదు చేస్తుంది. ఆ తర్వాత కూడా కరోనా మరణాలపై కేంద్రా రోగ్య శాఖ సమీక్ష చేస్తోంది. అంతర్జాతీయ ఆమోద యోగ్యమైన కరోనా నియమాలకు అనుగుణంగానే దేశంలో కరోనా మరణాలను నిర్ధారిస్తున్నాం. ఒకవేళ క్షేత్రస్థాయిలో ఏవైనా కొవిడ్‌ మరణాలు నమోదు కానివై ఉంటే వెంటనే రాష్ట్రాలకు అప్‌ డేట్‌ చేయమని సూచిస్తున్నాం. కొవిడ్‌ మరణాల నమోదుకు సంబంధించి జిల్లా స్థాయిలో క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని రాష్ట్రాలకు గట్టిగా చెబుతున్నాం. అందుకే కరోనా మరణాలపై అంతర్జాతీయ మీడియాల్లో వస్తోన్న వార్తలు, నివేదికల్లో ఎలాంటి వాస్తవం లేదు ‘ అని కేంద్రారోగ్య శాఖ స్పష్టం చేసింది.

Also Read:Ranji Trophy 2022: జట్టులో చోటు కష్టమన్నారు.. సూపర్‌ సెంచరీతో సత్తా చాటాడు.. ఫాం లోకి వచ్చిన టీమిండియా ఆటగాడు..

Viral Video: పుష్ప డైలాగులతో అదరగొడుతున్న చిన్నారి నెట్టింట వైరల్‌ అవుతున్న రీల్స్‌.. వీడియో

Zodiac Signs: ఈ నాలుగు రాశుల వారు తమ ప్రేమను ఎక్కువ కాలం నిలుపుకోలేరు.. బ్రేకప్స్ ఎక్కువగా అవుతాయి..