ఇప్పుడు అందరినీ కరోనా భయం వెంటాడుతోంది. ఏ రూపంలో ఎవరికి ఎటాక్ అవుతుందోనని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కరోనా.. కరోనా.. అని అందరూ ఇదే పేరును జపం చేస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తుండటంతో దేశ వ్యాప్తంగా.. 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను ప్రకటించారు పీఎం ప్రధాని నరేంద్ర మోదీ. అలాగే.. త్వరలోనే వాట్సాప్‌ను నిలిపివేస్తుందనే వార్త వైరలైంది. ఫేక్ వార్తలను నియంత్రించడంలో భాగంగా.. కేంద్రం ఈ చర్యకు పాల్పడుతున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదు. కేంద్రం వాట్సాప్‌ను నిలిపివేయడం లేదు. అటు మోదీ అందరికీ రీఛార్జ్ చేయిస్తాడని జరుగుతున్న ప్రచారమూ అబద్ధమే. కాబా వదంతులను నమ్మవద్దని ప్రధాని కోరిన కాసేపటికే ఇలాంటి ఫేక్ వార్తలు వైరలవుతున్నాయి.
కాగా.. ఇండియావ్యాప్తంగా.. 536 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 40 మంది రికవరీ అవ్వగా.. 11 మంది మరణించారు. అలాగే.. తెలంగాణ వ్యాప్తంగా 39 కోవిడ్ కేసులు, ఇక ఆంధ్రప్రదేశ్‌లో 8 కేసులు నమోదయినట్టు వైద్యులు ధృవీకరించారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా రోజురోజుకీ విజృంభిస్తోంది. దీంతో రెండు రాష్ట్రాలనూ.. సోమవారం నుంచే లాక్‌డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు రెండు రాష్ట్రాల సీఎంలు. ప్రజలను ఇంటి నుంచి బయటకు రానీయకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి: కరోనా అలెర్ట్: కొత్తవారు ఇంటికొస్తే వెయ్యి జరిమానా
సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 లక్షలు ప్రకటించిన చంద్రబాబు
పోలీస్ ఆఫీసర్‌పై కరోనా కేసు నమోదు.. తన కొడుకుకి కరోనా ఉందని చెప్పనందుకు..
ఫ్లాష్ న్యూస్: విశాఖలో మరో మూడు కరోనా కేసులు
ఇంట్లో ఉంటే కరోనా రాదనుకుంటే పొరపాటే.. సూచనలు ఇవే!
రీజన్ లేకుండా.. రోడ్డెక్కితే అంతే.. ప్రజలకు సీరియస్ వార్నింగ్