హిందూపురం పోలీస్ స్టేషన్‌లోనే తాగిన కానిస్టేబుల్స్‌

|

Jul 06, 2020 | 11:44 AM

అనంతపురం జిల్లా హిందూపురం‌లో కానిస్టేబుల్స్‌ రచ్చ చేశారు. స్టేషన్లోనే సిట్టింగ్‌ వేశారు.. బాధ్యతతో వ్యవహరించాల్సిన కానిస్టేబుల్స్‌ తప్పతాగారు. ఫుల్‌ బాటిల్‌ తెచ్చుకుని....

హిందూపురం పోలీస్ స్టేషన్‌లోనే తాగిన కానిస్టేబుల్స్‌
Follow us on

Drunk constables at police station : అనంతపురం జిల్లా హిందూపురం‌లో కానిస్టేబుల్స్‌ రచ్చ చేశారు. స్టేషన్లోనే సిట్టింగ్‌ వేశారు.. బాధ్యతతో వ్యవహరించాల్సిన కానిస్టేబుల్స్‌ తప్పతాగారు. ఫుల్‌ బాటిల్‌ తెచ్చుకుని.. తాపీగా తాగేశారు. తిరుమలేశ్‌, నూర్‌ మహమ్మద్‌ ఇదే స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్స్. తమను ఎవరు చూస్తారులే … అనుకున్నారో ఏమో.. స్టేషన్‌లో మందు కొట్టారు.

విచారణ గదిలో సిట్టింగ్‌ వేయడంతో అక్కడున్న కెమెరాలో అడ్డంగా బుక్కయ్యారు. గుట్టుగా సాగిందనుకున్న వారి తాగుడు వ్యవహారం భయటపడింది. లాక్‌డౌన్ సమయంలో సీజ్‌ చేసిన లిక్కర్‌ను ఓపెన్‌ చేసి.. తాగినట్లు విచారణలో తేలింది. దీంతో వీరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.