Corona Medicine: కరోనాతో అల్లాడిపోతున్న జనాలకు నిజంగానే గుడ్‌ న్యూస్.. తెలుగోడు ఇచ్చిన బ్రేక్‌త్రూ ఈ మెడిసిన్

గుడ్‌ న్యూస్‌... గుడ్‌ న్యూస్‌... కరోనాతో అల్లాడిపోతున్న జనాలకు నిజంగానే గుడ్‌ న్యూస్. కరోనా మహమ్మారిపై జరుగుతున్న ఫైట్‌లో తెలుగోడి ఇచ్చిన బ్రేక్‌త్రూ. కరోనాపై పాశుపతాస్త్రం లాంటి 2డీజీ డ్రగ్‌ను రెడీ చేసింది డీఆర్డీవో.

Corona Medicine: కరోనాతో అల్లాడిపోతున్న జనాలకు నిజంగానే గుడ్‌ న్యూస్.. తెలుగోడు ఇచ్చిన బ్రేక్‌త్రూ ఈ మెడిసిన్
Drdo Satish Reddy

Updated on: May 09, 2021 | 3:03 PM

గుడ్‌ న్యూస్‌… గుడ్‌ న్యూస్‌… కరోనాతో అల్లాడిపోతున్న జనాలకు నిజంగానే గుడ్‌ న్యూస్. కరోనా మహమ్మారిపై జరుగుతున్న ఫైట్‌లో తెలుగోడి ఇచ్చిన బ్రేక్‌త్రూ. కరోనాపై పాశుపతాస్త్రం లాంటి 2డీజీ డ్రగ్‌ను రెడీ చేసింది డీఆర్డీవో. తెలుగోడి ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న ఈ మందు ప్రపంచానికే సంజీవని కానుందీ.ఇప్పుడు వాడుతున్న రెమ్‌డెసివిర్‌ లాంటి మందులకు తలదన్నేలా రెడీ అయింది 2డీజీ డ్రగ్‌. క్లినికల్ ట్రయిల్స్‌లో గుడ్‌ రిజల్ట్స్‌ చూపిన 2డీజీ… ఈ నెల 12 నుంచి అందుబాటులోకి రానుంది. పొడి రూపంలో ఉండే ఈ మందును నీటిలో కలుపుకొని తాగేయొచ్చు. సీరియస్‌గా ఉన్న రోగులపై కూడా ఇది పని చేస్తుంది.

ఈ 2డీజీ డ్రగ్ తయారీలో ఎవరి పాత్ర ఏంటి…? ఇన్ని కోట్ల మందికి ఈ డ్రగ్‌ను ఎలా అందిస్తారు…? కరోనా కట్టడికి ఇంకా డీఆర్‌డీవో చేస్తున్న ప్రయోగాలేంటి? ఇలాంటి సంగతులెన్నో డీఆర్‌డీవో చీఫ్‌ స‌తీష్ రెడ్డి టీవీ9తో పంచుకున్నారు. కరోనా బాధితుల కోసం మరో ఔషధం అందుబాటులోకి రానుంది. డీఆర్డీవో అభివృద్ధి చేసిన 2-డీజీ డ్రగ్‌ అత్యవసర వినియోగానికి కేంద్రం ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ భాగస్వామ్యంతో డీఆర్డీవో న్యూక్లియర్ మెడిసిన్ & సైన్సెన్స్ సంయుక్తంగా 2-డీజీ డ్రగ్‌ను డెవలప్ చేసింది. ఆక్సిజన్ తీసుకోలేక ఇబ్బందులు పడుతున్న పేషెంట్లు స్పీడ్‌గా రికవరీ కావడానికి ఈ డ్రగ్ సహాయ పడనుందని స‌తీష్ రెడ్డి తెలిపారు. గ్లూకోజ్ మాదిరి ఫౌడర్ రూపంలో ఈ డ్రగ్ ను సంస్థ‌ తీసుకొస్తోంది. నీటిలో కరిగించి.. నోటి ద్వారా రోగికి అందిస్తారు. శరీరంలో ఇది వైరస్ సెల్స్ మీద నేరుగా పనిచేస్తుంది. ఇది ఎలా పని చేస్తోంది..? క్లినికల్ ట్రయిల్స్‌లో ఏం తేలింది…? ఈ డ్రగ్‌ తీసుకున్న ఎన్ని రోజుల్లో పేషెంట్‌ కోలుకునే ఛాన్స్ ఉందో త‌దిత‌ర వివ‌రాల‌ను దిగువ వీడియోలో చూడొచ్చు.

డీఆర్‌డీవో చీఫ్ తెలిపిన కీల‌క వివరాల స‌మాచారం….

Also Read:సిగరెట్ పొగలో ‘దాగిన’ కోవిడ్ 19 వైరస్, తస్మాత్ జాగ్రత్త అంటున్ననిపుణులు, తుంపరలు కూడా ప్రమాదకరమేనని హెచ్చరిక

కరోనా నుంచి కోలుకున్నాక టూత్ బ్రష్ మార్చాలి..! నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..