AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్ డౌన్ అమల్లో ఉంది.. మతపర కార్యక్రమాలకు ఫుల్ స్టాప్. కేంద్రం

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉందని, అందువల్ల ఎలాంటి మతపరమైన కార్యక్రమాలను గానీ, సామాజిక కార్యక్రమాలను గానీ ఎవరూ చేపట్టకుండా చూడాలని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకూ సూచించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే ఏ విధమైన ఫంక్షన్లు, సెలబ్రేషన్స్ జరగకుండా చూసేందుకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఏప్రిల్ నెలలో కొన్ని పండుగలు, పబ్బాలు వస్తున్నందున ప్రజలు ఉత్సాహంగా వీటిని జరుపుకునేందుకు ఉవ్విళ్ళూరుతారు. బంధు మిత్రులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు […]

లాక్ డౌన్ అమల్లో ఉంది.. మతపర కార్యక్రమాలకు ఫుల్ స్టాప్. కేంద్రం
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 11, 2020 | 3:36 PM

Share

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉందని, అందువల్ల ఎలాంటి మతపరమైన కార్యక్రమాలను గానీ, సామాజిక కార్యక్రమాలను గానీ ఎవరూ చేపట్టకుండా చూడాలని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకూ సూచించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే ఏ విధమైన ఫంక్షన్లు, సెలబ్రేషన్స్ జరగకుండా చూసేందుకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఏప్రిల్ నెలలో కొన్ని పండుగలు, పబ్బాలు వస్తున్నందున ప్రజలు ఉత్సాహంగా వీటిని జరుపుకునేందుకు ఉవ్విళ్ళూరుతారు. బంధు మిత్రులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు కూడా. అయితే కరోనా మహమ్మారి ఇంకా తగ్గుముఖం పట్టనందున ప్రజలు విధిగా 21 రోజుల లాక్ డౌన్ పాటించాలని ఈ శాఖ హితవు చెప్పింది. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే.. భారత శిక్షా స్మృతి కింద వివిధ సెక్షన్లపై వారిపై చర్యలు తీసుకుంటారని కూడా హోమ్ శాఖ హెచ్చరించింది. అయితే కర్ణాటకలో ఓ బీజేపీ ఎమ్మెల్యే శుక్రవారం తన పుట్టినరోజు వేడుకలను ఆర్భాటంగా జరుపుకున్నాడు. ఈ సెలబ్రేషన్స్ లో కొందరు చిన్నారులు కూడా పాల్గొనగా.. ఆయన మద్దతుదారులు, సన్నిహితులు సుమారు వంద మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు, ఎవరూ సామాజిక దూరం పాటించిన దాఖలాలు కూడా కనబడలేదు.  ఆ ఫంక్షన్ దరిదాపుల్లో ఒక్క పోలీసు కూడాకనిపిస్తే ఒట్టు !. ఈ వీడియో వైరల్ అయింది. మరి పిల్లలతో సహా ఇంతమందిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి ?

ఓటీటీలో భయానక సిరీస్.. తెగ చూస్తున్న జనాలు..
ఓటీటీలో భయానక సిరీస్.. తెగ చూస్తున్న జనాలు..
వేలులో మార్పులు కనిపిస్తున్నాయా?చిన్న సమస్య అనుకుని అలసత్వం వద్దు
వేలులో మార్పులు కనిపిస్తున్నాయా?చిన్న సమస్య అనుకుని అలసత్వం వద్దు
కోహ్లీ మెచ్చినోడే ఆస్ట్రేలియాకు సరైన మొగుడు..: మాజీ ప్లేయర్
కోహ్లీ మెచ్చినోడే ఆస్ట్రేలియాకు సరైన మొగుడు..: మాజీ ప్లేయర్
వామ్మో.. మరోసారి భారీగా పెరిగిన బంగారం.. ఎంతో తెలుసా..?
వామ్మో.. మరోసారి భారీగా పెరిగిన బంగారం.. ఎంతో తెలుసా..?
న్యూయర్ ఫీవర్.. మీటర్ దాటితే జైలుకే..! వాహనదారులకు మాస్ వార్నింగ్
న్యూయర్ ఫీవర్.. మీటర్ దాటితే జైలుకే..! వాహనదారులకు మాస్ వార్నింగ్
ఆఫర్ ఇస్తే మాకేంటీ అని అడిగారు.. సీరియల్ హీరోయిన్..
ఆఫర్ ఇస్తే మాకేంటీ అని అడిగారు.. సీరియల్ హీరోయిన్..
నాన్-వెజ్‌కి దూరంగా ఉంటే ఇన్ని లాభాలా..? అందంతో పాటు ఆరోగ్యం
నాన్-వెజ్‌కి దూరంగా ఉంటే ఇన్ని లాభాలా..? అందంతో పాటు ఆరోగ్యం
2025లో ప్రపంచ వేదికపై గర్జించిన భారత్.. రక్షణ రంగంలో కీలక పురోగతి
2025లో ప్రపంచ వేదికపై గర్జించిన భారత్.. రక్షణ రంగంలో కీలక పురోగతి
60 సెకన్లలోనే ఆన్ చేసుకోవచ్చు.. వాట్సప్‌లో ఎవరికీ తెలియని ట్రిక్.
60 సెకన్లలోనే ఆన్ చేసుకోవచ్చు.. వాట్సప్‌లో ఎవరికీ తెలియని ట్రిక్.
చల్లని నీరు తాగే అలవాటు ఉందా? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
చల్లని నీరు తాగే అలవాటు ఉందా? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!