ధార‌విలో క‌రోనా క‌ల్లోలం..బ‌య‌ట‌ప‌డ్డ మ‌రో పాజిటివ్ కేసు

ప్ర‌పంచ‌ద దేశాల‌ను దాటుకుంటూ భార‌త్‌లోకి ప్ర‌వేశించిన మ‌హ‌మ్మారి మురికివాడ‌ల‌ను క‌బ‌ళిస్తోంది. ముంబైలోని అతిపెద్ద స్ల‌మ్ ఏరియా ధారావిలో మ‌రో క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదు అయ్యింది.  35 ఏళ్ల ఓ డాక్ట‌ర్‌కు వైర‌స్ పాజిటివ్‌గా తేలింది. బాధిత డాక్ట‌ర్ స‌హా అత‌ని కుటుంబీకుల‌ను క్వారెంటైన్ చేశారు.  వారికి కూడా క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌నున్నారు. డాక్ట‌ర్‌కు సంబంధించిన కాంటాక్ట్స్‌ను ముంబై న‌గ‌ర‌పాల‌క సంస్థ ట్రాక్ చేస్తోంది. ధారావిలో ఆ డాక్ట‌ర్ నివాసం ఉంటున్న బిల్డింగ్‌ను సీల్ చేశారు. కాగా, […]

ధార‌విలో క‌రోనా క‌ల్లోలం..బ‌య‌ట‌ప‌డ్డ మ‌రో పాజిటివ్ కేసు

Edited By:

Updated on: Apr 03, 2020 | 10:29 AM

ప్ర‌పంచ‌ద దేశాల‌ను దాటుకుంటూ భార‌త్‌లోకి ప్ర‌వేశించిన మ‌హ‌మ్మారి మురికివాడ‌ల‌ను క‌బ‌ళిస్తోంది. ముంబైలోని అతిపెద్ద స్ల‌మ్ ఏరియా ధారావిలో మ‌రో క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదు అయ్యింది.  35 ఏళ్ల ఓ డాక్ట‌ర్‌కు వైర‌స్ పాజిటివ్‌గా తేలింది. బాధిత డాక్ట‌ర్ స‌హా అత‌ని కుటుంబీకుల‌ను క్వారెంటైన్ చేశారు.  వారికి కూడా క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌నున్నారు. డాక్ట‌ర్‌కు సంబంధించిన కాంటాక్ట్స్‌ను ముంబై న‌గ‌ర‌పాల‌క సంస్థ ట్రాక్ చేస్తోంది. ధారావిలో ఆ డాక్ట‌ర్ నివాసం ఉంటున్న బిల్డింగ్‌ను సీల్ చేశారు.
కాగా, బుధ‌వారం  ధారవిలో తొలి కరోనా మరణం సంభవించిన సంగ‌తి తెలిసిందే. ఎటువంటి ట్రావెల్ హిస్ట‌రీ లేన‌టువంటి  56 ఏళ్ల వ్యక్తి కోవిడ్ బారినప‌డి ప్రాణాలు కోల్పోయాడు. సియాన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. తాజాగా వెలుగు లోకి వ‌చ్చిన మ‌రో కోవిడ్-19 పాజిటివ్ కేసుతో ముంబై అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. మురికివాడ‌లు, జ‌న‌సాంద్ర‌త ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ క‌ఠినంగా అమ‌లుజ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకుంటోంది.