కరోనాను జయించిన ఐపీఎస్‌ దంపతులు

కరోనా బారినపడ్డ ఐపీఎస్‌ దంపతులు దీపికా పాటిల్‌, విక్రాంత్‌ పాటిల్ వైరస్‌ నుంచి కోలుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో శుక్రవారం తిరిగి విధుల్లో చేరిన వారికి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా

  • Jyothi Gadda
  • Publish Date - 5:08 pm, Fri, 17 July 20
కరోనాను జయించిన ఐపీఎస్‌ దంపతులు

కరోనా బారినపడ్డ ఐపీఎస్‌ దంపతులు దీపికా పాటిల్‌, విక్రాంత్‌ పాటిల్ వైరస్‌ నుంచి కోలుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో శుక్రవారం తిరిగి విధుల్లో చేరిన వారికి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన డీజీపీ కరోనాను జయించిన పోలీసులు ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని పిలుపునిచ్చారు. కరోనా బాధితుల్లో మనోధైర్యం నింపాలని సూచించారు. విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఏ మాత్రం అనుమానం ఉన్నా కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.

మరోవైపు ఏపీ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారం విడుదల చేసిన బులిటెన్‌లో రాష్ట్రంలో తొలిసారి రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,602 కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవి 2,592 కాగా.. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చినవారిలో 10 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, రవాణా సమాయాల్లో మాస్కు ధరించటాన్ని తప్పనిసరి చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.