Corona Case: వార‌ణాసిలో వింత కేసు న‌మోదు.. త‌ల్లికి క‌రోనా నెగిటివ్‌, పుట్టిన బిడ్డ‌కు పాజిటివ్‌..

|

May 27, 2021 | 6:26 PM

Corona Case: క‌రోనా మ‌హ‌మ్మారి మాన‌వ స‌మాజంతో పాటు వైద్యుల‌కు స‌వాల్ విసురుతోంది. ఎల్లో ఫంగ‌స్‌, బ్లాక్ ఫంగ‌స్ అంటూ కొత్త కొత్త వ్యాధుల‌కు దారి తీస్తూ వైద్యుల‌ను సైతం ఛాలెంజ్ చేస్తోంది...

Corona Case: వార‌ణాసిలో వింత కేసు న‌మోదు.. త‌ల్లికి క‌రోనా నెగిటివ్‌, పుట్టిన బిడ్డ‌కు పాజిటివ్‌..
Varanasi Mother Corona
Follow us on

Corona Case: క‌రోనా మ‌హ‌మ్మారి మాన‌వ స‌మాజంతో పాటు వైద్యుల‌కు స‌వాల్ విసురుతోంది. ఎల్లో ఫంగ‌స్‌, బ్లాక్ ఫంగ‌స్ అంటూ కొత్త కొత్త వ్యాధుల‌కు దారి తీస్తూ వైద్యుల‌ను సైతం ఛాలెంజ్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే కొత్త‌గా న‌మోద‌వుతోన్న కొన్ని కేసులు ఆశ్చ‌ర్యాన్నిక‌లిగిస్తున్నాయి. తాజాగా ఇలాంటి వింత‌ కేసు ఒక‌టి.. వార‌ణాసిలో చోటు చేసుకుంది.
వివ‌రాల్లోకి వెళితే.. వార‌ణాసికి చెందిన సుప్రియ అనే గ‌ర్భిణీ డెల‌వ‌రి నిమిత్తం మే 24న ఆసుప‌త్రిలో చేరింది. ఆ స‌మ‌యంలో వైద్యులు సుప్రియ‌కు ఆర్‌టీపీసీఆర్ విధానంలో కోవిడ్ పరీక్ష నిర్వ‌హించారు. ఇందులో ఆమెకు నెగిటివ్‌గా తేలింది. ఇక మే 25న వైద్యులు సుప్రియ‌కు స‌ర్జ‌రీ చేయ‌గా పండంటి ఆడ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. అయితే సాధార‌ణ పరీక్ష‌లో భాగంగా చిన్నారికి కోవిడ్ టెస్ట్ చేయ‌గా పాజిటివ్ వ‌చ్చింది. బ‌నార‌స్ హిందూ యూనివ‌ర్సిటీలోని సర్ సుందర్‌లాల్ ద‌వాఖాన‌లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న‌కు వైద్యులు ఆశ్చ‌ర్య‌పోయారు. చిన్నారికి క‌రోనా పాజిటివ్‌గా తేలిన‌ప్ప‌టికీ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం త‌ల్లీబిడ్డ ఒకే ద‌గ్గ‌ర ఉన్నార‌ని మ‌రికొన్ని రోజుల త‌ర్వాత ఇద్ద‌రినీ వేరు వేరుగా ఉంచుతామ‌ని వివ‌రించారు. ఇక నాలుగు రోజులు గ‌డిచాక మ‌రోసారి ఇద్ద‌రికీ క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని అధికారులు చెబుతున్నారు. మ‌రి త‌ల్లికి క‌రోనా నెగిటివ్ రాగా.. బిడ్డ‌కు పాజిటివ్‌గా ఎందుకు తేలింద‌న్న విష‌యాన్ని తెలుసుకునే ప‌నిలో ప‌డ్డారు వైద్యులు.

Also Read: Virinchi : విరించి హాస్పిటల్ నిర్వాకం, 9 రోజుల ట్రీట్మెంట్ తర్వాత చనిపోయిన రోగి.. 20 లక్షల బిల్లు.. అదేమంటే.!

RRR Movie: ప్ర‌పంచం మొత్తం చుట్టేయ‌నున్న తెలుగు సినిమా.. రాజ‌మౌళి కొత్త ఎత్తుగ‌డ‌.. ఏకంగా ఐదు అంత‌ర్జాతీయ‌ భాష‌ల్లో..

Viral: విమానంలో భార్యాభర్తల ముద్దులాట.. బ్లాంకెట్ ఇచ్చిన ఎయిర్ హోస్టెస్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.!