మరో కీలక నిర్ణయం దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం..? రైళ్లు, విమానాల రాకపోకలపై అంక్షలు.. కారణం అదేనా..?

దేశంలో మరో దఫా కరోనా వైరస్ కరాళనృత్యానికి జాగ్రత్త చర్యలు చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం. మొదటి దశలో పెరిగిన కేసుల దృష్ట్యా రాకపోకలపై అంక్షలు విధించాలని నిర్ణయించింది.

మరో కీలక నిర్ణయం దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం..? రైళ్లు, విమానాల రాకపోకలపై అంక్షలు.. కారణం అదేనా..?
Follow us

|

Updated on: Nov 20, 2020 | 7:08 PM

దేశంలో మరో దఫా కరోనా వైరస్ కరాళనృత్యానికి జాగ్రత్త చర్యలు చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం. మొదటి దశలో పెరిగిన కేసుల దృష్ట్యా రాకపోకలపై అంక్షలు విధించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుండటంతో ఢిల్లీ నుంచి ముంబయికి వచ్చే విమానాలను నిలిపివేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే, ఈ రెండు ప్రధాన నగరాల మధ్య నడిచే రైళ్ల సేవలను కూడా నిలిపివేయాలని చూస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. కొవిడ్ కేసుల సంఖ్య పెరగుతుండటంతో కఠిన నిర్ణయం తప్పదంటున్నారు నిపుణులు.

ఇదిలా ఉండగా, అక్టోబర్ 28 నుంచి ఢిల్లీలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నవంబర్‌ 11న మరోసారి 8వేల మార్కును దాటి ఆందోళనకు గురిచేసింది. అలాగే, గడిచిన 24 గంటల్లో 7,500 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ క్రమంలో దిల్లీ ప్రభుత్వం కఠిన నిబంధనలకు ఉపక్రమించింది. వివాహ వేడుకల వంటి శుభకార్యాలకు 50 మందిని మాత్రమే అనుమతించడం, మాస్క్‌ ధరించని వారికి రూ.2,000 జరిమానా విధించడం వంటి చర్యలు చేపడుతోంది.

ఇక, కొవిడ్-19 కేసులు అధిక సంఖ్యలో వెలుగుచూస్తోన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఉన్నతస్థాయి బృందాలను పంపే యోచనలో ఉన్నట్లు శుక్రవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వెలుగులోకిరాని కేసులను గుర్తించేందుకు విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాలకు సూచించింది. మరోసారి కేంద్రం ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అవసరమైతే, కంటైన్మెంట్ జోన్లను పెంచాలని సూచించింది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..