మెట్రోరైలు ఉద్యోగులకు కరోనా పాజిటివ్

ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్‌లో పనిచేస్తున్న 20 మంది ఉద్యోగులకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది.

మెట్రోరైలు ఉద్యోగులకు కరోనా పాజిటివ్
Follow us

|

Updated on: Jun 05, 2020 | 12:24 PM

ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా అన్ని వ్యవస్థలను వణికిస్తోంది. తాజాగా ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్‌లో పనిచేస్తున్న 20 మంది ఉద్యోగులకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. వారితోపాటు కలిసి పనిచేస్తున్న ఉద్యోగులకు అధికారులు హోం క్వారెంటైన్‌ విధించారు. వారు పనిచేస్తున్న కార్యాలయాల్లోని అన్ని గదులను సీజ్ చేశారు. అనంతరం మెట్రోరైలు కార్యాలయాలు, రైల్వేస్టేషన్లను శానిటైజ్ చేయించినట్లుగా మెట్రోరైలు అధికారులు వివరించారు.

లాక్‌డౌన్‌ 5.0లో భాగంగా అన్ని వ్యవస్థలు పనిలో పడుతున్నాయి. అయితే ఢిల్లీ మెట్రో ట్రైయిన్  మాత్రం ఎప్పుడు పట్టాలు ఎక్కనుందనేదానిపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఇదిలావుంటే… ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాక అన్ని రకాల ముందుజాగ్రత్తలు తీసుకొని మెట్రోరైలు సర్వీసులను నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని మెట్రో అధికారులు తెలిపారు. ఇందుకు సింబాలిక్‌గా.. ఢిల్లీ మెట్రోరైలు మస్కట్, మాస్క్, గ్లోవ్స్ ధరించిన బాలిక పోస్టరును అధికారులు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.