Corona Alert: సోష‌ల్ మీడియాలో వ‌స్తోన్న క‌రోనా వార్త‌ల‌ను చూసి క‌న్ఫ్యూజ్ అవుతున్నారా.? దీనికి ప‌రిష్కారమే..

|

May 01, 2021 | 2:31 PM

Corona Alert: క‌రోనా ఓ వైపు మ‌నుషుల ఆరోగ్యాల‌తో చెల‌గాట‌మాడుతుంటే... సోష‌ల్ మీడియాలో వ‌స్తోన్న వార్త‌లు మ‌రింత ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. ప‌లానా చోట ఆక్సిజ‌న్ అందుబాటులో ఉందంటా, ప‌లానా...

Corona Alert: సోష‌ల్ మీడియాలో వ‌స్తోన్న క‌రోనా వార్త‌ల‌ను చూసి క‌న్ఫ్యూజ్ అవుతున్నారా.? దీనికి ప‌రిష్కారమే..
Corona Website
Follow us on

Corona Alert: క‌రోనా ఓ వైపు మ‌నుషుల ఆరోగ్యాల‌తో చెల‌గాట‌మాడుతుంటే… సోష‌ల్ మీడియాలో వ‌స్తోన్న వార్త‌లు మ‌రింత ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. ప‌లానా చోట ఆక్సిజ‌న్ అందుబాటులో ఉందంటా, ప‌లానా చోట్ల బెడ్లు ఖాళీగా ఉన్నాయంటా, ప్లాస్మా దాత‌లు ఇక్క‌డు ఉన్నారు. అంటూ ర‌క‌ర‌కాల మెసేజ్‌లు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ల‌లో వైర‌ల్ అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఏది అసలైన స‌మాచారం, ఏది న‌కిలీ స‌మాచార‌మో తెలియ‌క నెటిజ‌న్లు క‌న్ఫ్యూజ్‌కు గుర‌వుతున్నారు. ఈ స‌మస్య‌కు చెక్ పెట్ట‌డానికే సైబ‌రాబాద్ పోలీసులు ఓ వినూత్న ఆలోచ‌న చేశారు. సొసైటీ ఫ‌ర్ సైబ‌రాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) స‌హ‌కారంతో covid.scsc.in అనే వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. శుక్ర‌వారం నుంచి ఈ వెబ్‌సైట్ అందుబాటులోకి వ‌చ్చింది.

వెబ్ సైట్ అందించే వివ‌రాలు..

* ఆక్సిజ‌న్ అందించేవారి వివ‌రాలు, కోవిడ్ చికిత్స అందిస్తోన్న ఆసుప‌త్రులు వాటిలో అందుబాటులో ఉన్న బెడ్స్ వివ‌రాలు, ప్లాస్మా అందించే కేంద్రాలు, బ్లండ్ బ్యాంకులు, అంబులెన్స్ సేవ‌లు, అంతిమ సంస్కారాలు చేసే సంస్థ‌ల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

* వీటితో పాటు… ఐసోలేష‌న్ సెంట‌ర్ల వివ‌రాలు, ఫార్మిస్యూటిక‌ల్స్‌, హోమ్ ఐసోలేష‌న్‌లో ఉంటున్న‌వారికి స‌ల‌హాలు, నేరుగా డాక్ట‌ర్‌తో మాట్లాడే అవ‌కాశం, డ‌యాగ్న‌స్టిక్ సెంట‌ర్ల వివ‌రాలను అందిస్తున్నారు.

* ఇక క‌రోనా విష‌యంలో వస్తోన్న వార్త‌ల్లో నిజానిజాల‌ను తెలుసుకే వీలుగా కోవిడ్ బులిటిన్స్ అందిస్తారు. అలాగే స‌హాయం కోసం ఎదురు చూసే వారికి అవ‌స‌ర‌మ‌య్యే కీల‌క ఫోన్ నెంబ‌ర్ల‌ను అందుబాటులో ఉంచారు. వీటితో పాటు వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ల వివ‌రాల‌ను కూడా ఈ వెబ్ సైట్‌లో పొందుప‌రిచారు.

* క‌రోనాకు సంబంధించి ఎవ‌రికీ ఎలాంటి సందేహం వ‌చ్చినా covid.scsc.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి నివృత్తి చేసుకోండి. అపోహ‌ల‌ను త‌రిమికొట్టండి.

Also Read: TS PGECET 2021: తెలంగాణ పీజీఈసెట్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు.. ఎప్పటివరకంటే..?

Shahabuddin: కరోనాతో ఆర్జేడీ మాజీ ఎంపీ షాహబుద్దీన్ మృతి.. ధ్రువీకరించిన తీహార్ జైలు డీజీ..

కొవిడ్ లక్షణాలలో ఆ రెండు చాలా డేంజరట..! కోలుకోవడానికి చాలా సమయం పడుతుందట..? తెలుసుకోండి..