ఆసుపత్రి భవవం నుంచి దూకి.. కరోనా సోకిన వ్యక్తి ఆత్మహత్య..!

కరోనా సోకిన ఓ వ్యక్తి ఆసుపత్రి భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.

ఆసుపత్రి భవవం నుంచి దూకి.. కరోనా సోకిన వ్యక్తి ఆత్మహత్య..!

Edited By:

Updated on: Apr 27, 2020 | 4:37 PM

కరోనా సోకిన ఓ వ్యక్తి ఆసుపత్రి భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. 50ఏళ్ల వ్యక్తికి కరోనా సోకినట్లు ఏప్రిల్ 24న తెలిసింది. దీంతో ఆయనను నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసోలేషన్‌ వార్డులో ఆయనకు చికిత్స అందించారు. ఇక ఇటీవల ఆయనకు కరోనా లక్షణాలు కనిపించకపోగా.. ముందుగానే మూత్రపిండ సమస్యలు ఉండటంతో ఐసీయూకు మార్చారు. ఈ క్రమంలో ఈ ఉదయం ఆసుపత్రి భవనం నుంచి దూకి ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఉదయం గం.8.30ని.ల సమయంలో ఈ సంఘటన జరిగినట్లు వారు తెలిపారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ.. ఇది ఆత్మహత్యనా..? లేక యాక్సిడెంటా..? అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. కాగా కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 511కు చేరగా.. 19 మంది మృత్యువాడపడ్డారు.

Read this Story Also: షాకింగ్.. ‘పుష్ప’ నుంచి ఆ నటిని తప్పించారా..!