Booster Shot: బూస్టర్ డోస్‌ తీసుకున్న తర్వాత చాలామందిలో ఈ సైడ్‌ ఎఫెక్ట్‌.. ఎందుకంటే..?

|

Feb 07, 2022 | 11:33 AM

Booster Shot: సాధారణంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నాక కొన్ని రకాల దుష్ప్రభావాలు ఎదురైన సంగతి తెలిసిందే. అందులో జ్వరం, చలి, చేయి నొప్పులు

Booster Shot: బూస్టర్ డోస్‌ తీసుకున్న తర్వాత చాలామందిలో ఈ సైడ్‌ ఎఫెక్ట్‌.. ఎందుకంటే..?
Booster Dose
Follow us on

Booster Shot: సాధారణంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నాక కొన్ని రకాల దుష్ప్రభావాలు ఎదురైన సంగతి తెలిసిందే. అందులో జ్వరం, చలి, చేయి నొప్పులు వంటివి ముఖ్యంగా చెప్పవచ్చు. కానీ బూస్టర్‌ డోస్‌ తర్వాత కూడా చాలా మంది ఒక విచిత్రమైన సైడ్ ఎఫెక్ట్‌ని ఎదుర్కొంటున్నారు. ఇంతకు ముందు వ్యాక్సిన్‌ వేసుకున్నప్పుడు ఈ లక్షణం కనిపించలేదు. బూస్టర్‌ డోస్ పొందిన చాలా మంది ఒకరకమైన లోహపు రుచిని అనుభవిస్తున్నారు. ఆరోగ్యవంతమైన వ్యక్తులు కూడా ఈ సమస్యని ఎదుర్కొంటున్నారు.

వాస్తవానికి ఈ లోహపు రుచికి సంబంధించిన మొదటి కేసు గత సంవత్సరం USAలో వెలుగులోకి వచ్చింది. కొంతమంది దీనిని తీవ్రమైనదిగా అభివర్ణించారు. నికెల్‌ లాంటి లోహ రుచి ఎలా ఉంటుందో నోటిలో అలా ఉందని చెప్పారు. ఇది కొన్ని రోజులవరకు అలాగే ఉంటుందని అన్నారు. అంతేకాదు US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ దీనిని నిర్ధారించలేదు. బూస్టర్‌ డోస్‌ తీసుకున్న వెంటనే ఒక వ్యక్తి లోహ లక్షణాలను అనుభవిస్తే అది సాధారణమైనదని భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.

అయితే బూస్టర్‌ డోస్‌ వేసుకున్న తర్వాత వాసన, రుచి కోల్పోయినట్లు అనిపిస్తే అది COVID-19 ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చని సూచించారు. కానీ ప్రతి ఒక్కరు ఈ లక్షణాన్ని అనుభవించడంలేదు. కొంతమంది మామూలుగానే ఉంటున్నారు. ఈ లోహపు రుచి టీకాతో మాత్రమే కాదు ఏదైనా మెడిసిన్‌ వాడుతున్నా, సైనస్‌ వంటి లక్షణాలతో ఇబ్బందిపడుతున్నా ఈ సమస్య ఎదురవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Amla Powder: మొటిమలు, నల్లమచ్చలకు ఉసిరి పొడి దివ్య ఔషధం.. ఎలా వాడాలంటే..?

Eyes Health: కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 ఆహారాలు తప్పనిసరి.. ఏంటో తెలుసుకోండి..?

IND vs WI: విరాట్‌ కోహ్లీ రికార్డ్‌ని బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ.. ఏ విషయంలో తెలుసా..?