Balram Bhargava: కరోనా వ్యాక్సిన్ గ‌ర్భిణుల‌కూ ఇవ్వాల్సిందే.. ఐసీఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ

Covid-19 vaccine - pregnant women: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. చిన్నారులకు కూడా టీకా ఇచ్చేందుకు ట్రయల్స్

Balram Bhargava: కరోనా వ్యాక్సిన్ గ‌ర్భిణుల‌కూ ఇవ్వాల్సిందే.. ఐసీఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ
Icmr Chief Balram Bhargava

Edited By: Shiva Prajapati

Updated on: Jun 26, 2021 | 8:25 AM

Covid-19 vaccine – pregnant women: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. చిన్నారులకు కూడా టీకా ఇచ్చేందుకు ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసింది. కోవిడ్ టీకాల‌ను గ‌ర్భిణుల‌కు ఇవ్వ‌వ‌చ్చు అని కేంద్ర ఆరోగ్య‌శాఖ త‌న మార్గ‌ద‌ర్శ‌కాల్లో సూచించింద‌ని పేర్కొంది. ప్రెగ్నెంట్ మ‌హిళ‌లకు కూడా ఇవ్వాల్సిందేనని ఐసీఎంఆర్ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ బ‌ల‌రామ్ భార్గ‌వ తెలిపారు. సార్స్ సీవోవీ2 వేరియంట్లు అయిన ఆల్పా, బీటా, గామా, డెల్టాల‌పై కోవీషీల్డ్‌, కోవాక్సిన్ టీకాలు ప‌నిచేస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో ఒకే ఒక దేశం పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ ఇస్తున్న‌ట్లు ఐసీఎంఆర్ చీఫ్ తెలిపారు. అయితే మ‌రి చిన్న పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ అవ‌స‌రమా అన్న‌ది ఇంకా తెలియ‌ని ప్ర‌శ్న‌గానే మిగిలిపోయింద‌ని ఆయన పేర్కొన్నారు. డేటా పూర్తిగా తెలియ‌నంత వ‌ర‌కు.. పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ ఇవ్వ‌లేమ‌ని బ‌ల‌రామ్ భార్గ‌వ్ వెల్ల‌డించారు. దీనిపై తాము స్ట‌డీ కూడా చేప‌డుతున్నట్లు ఆయ‌న చెప్పారు. 2 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు పిల్ల‌ల్లో ప‌రీక్షిస్తున్న‌ట్లు తెలిపారు. వాటి ఫ‌లితాలు సెప్టెంబ‌ర్ వ‌ర‌కు వ‌స్తాయ‌న్నారు.

కాగా.. 12 దేశాల్లో డెల్టాప్ల‌స్ కేసులు ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఇండియాలో 50 కేసుల‌ను గుర్తించిన‌ట్లు తెలిపారు. డెల్టా ప్ల‌స్ వైర‌స్‌ను ఐసోలేట్ చేసి క‌ల్చ‌ర్ చేస్తున్నామ‌ని, మిగితా వేరియంట్ల‌కు చేసిన ప‌రీక్ష‌ల‌నే చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. ల్యాబ్‌లల్లో వ్యాక్సిన్ స‌మ‌ర్థ‌త‌ను ప‌రీక్షిస్తున్నామ‌ని, మ‌రో ప‌ది రోజుల్లో ఫ‌లితాలు వ‌స్తాయ‌ంటూ బ‌ల‌రామ్ భార్గ‌వ తెలిపారు.

Also Read:

MAA Elections: ఆ అగ్రనటులంతా లోకలా? మీరు ప్రేమించే రాముడు సీత నాన్ లోకల్: రామ్ గోపాల్ వర్మ 

Kaleshwaram Project: ప్రపంచవ్యాప్తంగా మార్మోగిన ‘కాళేశ్వరం’ ఖ్యాతి.. డిస్కవరీ ఛానెల్‌లో డాక్యుమెంటరీ ప్రసారం..