మాస్క్‌ లేకపోతే రేషన్‌ కట్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అంతేకాదు..

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం ఇప్పుడు కరోనా విముక్త రాష్ట్రాలుగా అయ్యాయి. అందులో గోవా కూడా ఒకటి. అయితే ఇక్కడి ప్రభుత్వం ఇంకా లాక్‌డౌన్ కొనసాగిస్తూ.. కఠిన చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్‌తో పాటు లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా బయట తిరిగే వారికి మాస్క్‌ తప్పనిసరి చేసింది. మాస్క్‌ ధరించకపోతే పెట్రోల్‌ పోయకూడదని పెట్రోల్‌ బంకులకు ఆదేశించింది. […]

మాస్క్‌ లేకపోతే రేషన్‌ కట్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అంతేకాదు..
Follow us

| Edited By:

Updated on: May 01, 2020 | 5:25 PM

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం ఇప్పుడు కరోనా విముక్త రాష్ట్రాలుగా అయ్యాయి. అందులో గోవా కూడా ఒకటి. అయితే ఇక్కడి ప్రభుత్వం ఇంకా లాక్‌డౌన్ కొనసాగిస్తూ.. కఠిన చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్‌తో పాటు లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా బయట తిరిగే వారికి మాస్క్‌ తప్పనిసరి చేసింది. మాస్క్‌ ధరించకపోతే పెట్రోల్‌ పోయకూడదని పెట్రోల్‌ బంకులకు ఆదేశించింది. అంతేకాదు.. నెలవారిగా ప్రభుత్వం ఇచ్చే రేషన్ సరుకులను కూడా ఇవ్వకూడదని నిబంధన తీసుకొచ్చింది. ఈ విషయాన్ని గోవా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. కరోనా మహమ్మారి కట్టడి నేపథ్యంలో భాగంగా,, మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇక త్వరలో ప్రజలకు అవగాహన వచ్చేలా ‘నో మాస్క్- నో పెట్రోల్, నో రేషన్’ అన్న ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఈ విషయం ప్రజలందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని పౌరసరఫరాల శాఖను సీఎస్ ఆదేశించారు.