Corbevax Vaccine: గేమ్ ఛేంజర్‌గా మరో హైదరాబాద్ టీకా.. బయోలాజికల్ ఇ వ్యాక్సిన్‌కు 90 శాతం సమర్థత..!

|

Jun 17, 2021 | 10:05 PM

Biological E – Covid Vaccine: దేశంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో భారత్‌లోకి త్వరలో అతితక్కువ ధరలో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి

Corbevax Vaccine: గేమ్ ఛేంజర్‌గా మరో హైదరాబాద్ టీకా.. బయోలాజికల్ ఇ వ్యాక్సిన్‌కు 90 శాతం సమర్థత..!
Covid 19 vaccine
Follow us on

Biological E – Covid Vaccine: దేశంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో భారత్‌లోకి త్వరలో అతితక్కువ ధరలో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఇ ఫార్మా సంస్థ వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే బయోలాజికల్ ఈ ఫార్మా అభివృద్ధి చేసిన కార్బివాక్స్ కోవిడ్ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలనే డీసీజీఐ మూడో దశ క్లినకల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతులిచ్చింది. అయితే.. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో భారత్‌ అభివృద్ధి చేస్తోన్న టీకాల్లో కార్బివాక్స్ కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాగ్జిన్‌ టీకా మహమ్మారిని నిరోధించడంలో మెరుగైన పనితీరు కనబరుస్తోంది.

అయితే.. బయోలాజికల్‌ ఇ కార్బివాక్స్‌ కూడా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో దాదాపు 90శాతానికిపైగా ప్రభావశీలత చూపిస్తున్నట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు నొవావాక్స్‌ టీకా ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. అయితే.. భారత్‌లోనే ఏటా దాదాపు వంద కోట్ల డోసులు ఉత్పత్తి కానుండడంతో ఈ టీకాలపై అంచనాలు మరింత పెరిగాయి. 90 శాతం సామర్థ్యం కలిగిన ఈ టీకాలు చౌక ధరలోనే అందుబాటులోకి రానున్నాయి. బయోలాజికల్‌ ఇ (బీఈ) వ్యాక్సిన్‌ మంచి ఫలితాలు కనబరుస్తుందని కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్టర్‌ ఎన్‌కే అరోరా పేర్కొన్నారు. అంతేకాకుండా గతంలో వినియోగించిన సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ టీకాలు అన్ని వయసులవారికీ సురక్షితమని పేర్కొన్నారు. అక్టోబర్‌ నాటికి ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

తుది ఫలితాలు ఇదే విధంగా ఉంటే.. కోవిడ్ పోరులో కార్బివాక్స్, నోవావాక్స్ వ్యాక్సిన్‌లు గేమ్‌ ఛేంజర్‌గా మారుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్బివాక్స్‌ మూడోదశ ప్రయోగాలు జులై నాటికి పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read:

Google Help: కరోనా కష్టకాలంలో గూగుల్‌ చేయూత.. రూ.113 కోట్ల భారీ విరాళం.. ఆక్సిజన్ల ప్లాంట్ల ఏర్పాటు, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ

Stalin calls on PM Modi : ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తమిళనాడు సీఎం స్టాలిన్.. 25 అంశాలతో కూడిన మెమోరాండం సమర్పణ