Coronavirus: దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు.. నిన్న 50లోపే మరణాలు.. ప్రస్తుతం ఎన్ని యాక్టివ్‌ కేసులున్నాయంటే..

|

Mar 13, 2022 | 12:15 PM

మూడో వేవ్‌లో ముప్పుతిప్పలు పెట్టిన కరోనా (Corona Virus) క్రమంగా అదుపులోకి వస్తోంది. దేశంలో కొత్త కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది.

Coronavirus: దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు.. నిన్న 50లోపే మరణాలు.. ప్రస్తుతం ఎన్ని యాక్టివ్‌ కేసులున్నాయంటే..
Coronavirus In India
Follow us on

మూడో వేవ్‌లో ముప్పుతిప్పలు పెట్టిన కరోనా (Corona Virus) క్రమంగా అదుపులోకి వస్తోంది. దేశంలో కొత్త కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. గత రెండు రోజుల నుంచి మరణాల సంఖ్య కూడా తగ్గుతుండడం ఊరటనిచ్చే విషయం. ముందురోజు 89గా ఉన్న కరోనా మరణాలు.. తాజాగా 50 దిగువకు చేరడం గమనార్హం. ఈ మేరకు ఆదివారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ(Health Ministry) కరోనా బులెటిన్‌ ను విడుదల చేసింది. దీని ప్రకారం గడిచిన 24 గంటల్లో 7,61,737 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,116 మందికి మందికి వైరస్ సోకినట్లు తేలింది. నిన్న మరో 47 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 5,15,850 మంది కొవిడ్‌కు బలయ్యారు. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీ కేసులు అధికంగా ఉంటున్నాయి. ఈక్రమంలో నిన్న 5,559 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.24 కోట్లు దాటింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.71 శాతానికి చేరుకుంది.

కాగా దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 0.41 శాతం ఉండగా, వీక్లీ పాజిటివిటీ రేటు 0.50 శాతంగా ఉంది. ఇక క్రియాశీల కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతోంది. ప్రస్తుతం దేశంలో 38,069 (0.09%) యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయి. ఇక కరోనాను పూర్తిగా కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. నిన్న 20,31,275 మంది టీకాలు వేయించుకున్నారు. కాగా దేశంలో ఇప్పటి వరకూ పంపిణీ చేసిన కొవిడ్‌ డోసుల సంఖ్య 180 కోట్లు దాటింది. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగానూ రోజువారీ కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. తాజాగా 16,89,274 కేసులు నమోదయ్యాయి. మరో 4,571 మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read:UP CM Yogi Delhi Tour: ఢిల్లీకి చేరుకున్న యూపీ సీఎం యోగి.. సాయంత్రం ప్రధానితో భేటీ.. కొత్త మంత్రివర్గ కూర్పుపై చర్చ!

Andhra Pradesh: ఈ చేప విషంతో మనిషిని చంపేస్తుంది.. కోనసీమలో వలలో చిక్కింది…

Rakesh Jhunjhunwala: బిగ్ బుల్ పెట్టుబడి పెట్టిన టాటా షేర్లు.. ఆ 4 కంపెనీల్లో ఎంత లాభం వచ్చిందంటే..