Telangana Covid 19 Again : ఉయ్యాలవాడ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఇవాళ 12 మంది బాలికలకు కరోనా

|

Mar 20, 2021 | 4:06 PM

Telangana Schools news : తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ జ్యోతిబాపూలే గురుకుల..

Telangana Covid 19 Again : ఉయ్యాలవాడ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఇవాళ 12 మంది బాలికలకు కరోనా
School Children Corona Uyya
Follow us on

Telangana Schools news : తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో కరోనా విజృంభిస్తోంది. గత రెండు రోజులుగా కరోనా కేసులు పెరగుతుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈరోజు మరో 12 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. దీంతో కరోణ కేసుల సంఖ్య 16 కి చేరింది. నిన్న 83 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి కరోనా సోకినట్టు తేలింది. ఈరోజు 300 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. దీంతో మరో 12 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.

ఫలితంగా పాఠశాలలో మొత్తం 16 మంది బాలికలపై కరోనా మహమ్మారి పంజా విసిరింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు హుటాహుటీన స్పందించి స్కూలంతా శానిటేషన్ చర్యలు చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థికి పరీక్షలు నిర్వహించారు. 16 మంది విద్యార్థులను ఏరియా ఆసుపత్రికి తరలించి ఐసొల్యూషన్ లో ఉంచి చికిత్సలు అందిస్తున్నారు.

ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలాఉంటే, తిమ్మాజిపేట మండల కేంద్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయురాలికి ఈరోజు ఉదయం కారోనా పాజిటివ్ అని తేలింది. దాంతో తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు.

Read also : Swimmer Smt G. Syamala : 47 ఏళ్ల వయసులో 30 కి.మీ మేర సముద్రాన్ని విజయవంతంగా ఈదిన హైదరాబాద్ మహిళ