సీఆర్‌పీఎఫ్‌లో క‌రోనా : 52కు చేరిన పాజిటివ్ కేసులు, ఒక‌రు మృతి

| Edited By: Pardhasaradhi Peri

May 01, 2020 | 7:26 PM

CRPF ..సెంట్రల్ రిజర్వ్ పోలిస్ ఫోర్స్ లో కరోనా క‌ల్లోలం రేపుతోంది. సీఆర్‌పీఎఫ్ లోనూ వ‌రుస‌గా పెద్ద సంఖ్య‌లో క‌రోనా పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డుతుంటం అధికారుల్లోనూ తీవ్ర ఆందోళ‌న‌ రేపుతోంది.

సీఆర్‌పీఎఫ్‌లో క‌రోనా : 52కు చేరిన పాజిటివ్ కేసులు, ఒక‌రు మృతి
Follow us on
CRPF ..సెంట్రల్ రిజర్వ్ పోలిస్ ఫోర్స్ లో కరోనా క‌ల్లోలం రేపుతోంది. సీఆర్‌పీఎఫ్ లోనూ వ‌రుస‌గా పెద్ద సంఖ్య‌లో క‌రోనా పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డుతుంటం అధికారుల్లోనూ తీవ్ర ఆందోళ‌న‌ రేపుతోంది. ఇప్ప‌టికే వీరిలో 52 మందికి క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. కాగా, ఒక‌రు క‌రోనా బారిన ప‌డి ప్రాణాలు కోల్పోయారు.
ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్-3 కేంద్రంగా పనిచేసే 31వ బెటాలియన్‌లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గురువారం మరో ఆరుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు చెప్పారు. వీరిలో ఒకరు జాతీయ కబడ్డీ జట్టు ప్లేయర్ కూడా ఉన్నట్లు తెలిపారు. తాజా కేసులతో సీఆర్‌పీఎఫ్‌లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52కి చేరింది. బాధితులంతా ఒకే యూనిట్‌లో పనిచేస్తున్నారని అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటికే CRPF బెటాలియన్‌కు చెందిన కరోనా బాధితుల్లో ఒకరు మరణించారు. వరుస కేసుల నేపథ్యంలో 31వ బెటాలియన్ కార్యాలయాన్ని ఢిల్లీ వైద్యాధికారులు సీల్ చేశారు. సిబ్బందిని మొత్తం క్వారంటైన్ చేశారు. గురువారం 89 మందికి పరీక్షలు చేయగా.. ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.