200 కి.మీ. నడక.. నడిచి..నడిచి.. శాశ్వత నిద్రలోకి ..

| Edited By: Ravi Kiran

Mar 29, 2020 | 3:00 PM

లాక్ డౌన్ కారణంగా  రైళ్లు, బస్సులు లేకపోవడంతో తమ గ్రామాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్న వేలాది వలస కార్మికులు, శ్రామిక జీవుల్లో రణవీర్ సింగ్ కూడా ఒకడు. 38 ఏళ్ళ ఇతగాడు ఢిల్లీలో డెలివరీ ఏజెంటుగా పనిచేస్తున్నాడు. తను పని చేసే సంస్థ మూతబడడంతో.. చేతిలో డబ్బులు లేవు.. తినడానికి తిండి లేదు.. ఏం చేయాలో తోచక రణవీర్ సింగ్ మధ్యప్రదేశ్ లోని తన సొంత జిల్లా ‘మోరేనా’ కు కాలినడకన బయల్దేరాడు. ఢిల్లీ నగరానికి, ఈ […]

200 కి.మీ. నడక.. నడిచి..నడిచి.. శాశ్వత నిద్రలోకి ..
Follow us on

లాక్ డౌన్ కారణంగా  రైళ్లు, బస్సులు లేకపోవడంతో తమ గ్రామాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్న వేలాది వలస కార్మికులు, శ్రామిక జీవుల్లో రణవీర్ సింగ్ కూడా ఒకడు. 38 ఏళ్ళ ఇతగాడు ఢిల్లీలో డెలివరీ ఏజెంటుగా పనిచేస్తున్నాడు. తను పని చేసే సంస్థ మూతబడడంతో.. చేతిలో డబ్బులు లేవు.. తినడానికి తిండి లేదు.. ఏం చేయాలో తోచక రణవీర్ సింగ్ మధ్యప్రదేశ్ లోని తన సొంత జిల్లా ‘మోరేనా’ కు కాలినడకన బయల్దేరాడు. ఢిల్లీ నగరానికి, ఈ జిల్లాకు మధ్య దూరం 326 కికిలోమీటర్లు.. అయితే కనీసం 200 కి.మీ. నడిస్తే చాలు.. తన గ్రామానికి చేరుకోగలుగుతానని అనుకున్నాడు. బుధవారం సాయంత్రం ఈ నగరం నుంచి కాళ్లకు పని చెప్పాడు. కానీ .. అలసి, సొలసి..  మధ్యదారి యూపీ లోని ఆగ్రా హైవే లోనే కుప్పకూలిపోయాడు. రోడ్డుపై పడిపోయిన ఇతనికి ఓ షాప్ కీపర్ టీ, బిస్కెట్లు ఇచ్చాడు. కానీ  కొద్దిసేపటికే రణవీర్ సింగ్ గుండెపోటుతో మరణించాడు.

కరోనా నివారణకు మోదీ ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ అయితే ప్రకటించింది గానీ..ఇలాంటి నిర్భాగ్యుల గురించి ఆలోచించ లేదు, రణవీర్ సింగ్ వంటి అభాగ్యులు ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు. తమ కుటుంబాలను కలుసుకునేందుకు వందలాది మైళ్ళ దూరం కూడా కాలి  నడకన వెళ్తున్నారంటే.. ఇందుకు బాధ్యత ఎవరిది?  పిల్లా, పాపలతో మహిళలు సైతం కాలి  నడకనే కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తున్న దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి.