చాపకింద నీరులా మహమ్మారి! పెరుగుతున్న కోవిడ్‌-19 కేసుల ముప్పుతో మరో వేవ్‌ తప్పదా..?

|

Apr 15, 2023 | 5:27 PM

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇన్ఫెక్షన్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రజలు, అధికారయంత్రాంగం మళ్లీ భయాందోళనకు గురవుతున్నారు. గతంలో వచ్చిన కరోనా వేవ్ ప్రజలను తీవ్రంగా దెబ్బతీసింది. రోజురోజుకు సంఖ్య పెరుగుతుండడంతో ఇదెక్కడికి దారితీస్తుందోననే ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ కలిగిస్తోంది.

చాపకింద నీరులా మహమ్మారి! పెరుగుతున్న కోవిడ్‌-19 కేసుల ముప్పుతో మరో వేవ్‌ తప్పదా..?
Corona Virus
Follow us on

గత మూడేళ్లకు పైగా కరోనా వైరస్ ప్రపంచ ప్రజలను వణికిస్తోంది. తీవ్రమైన ఇన్ఫెక్షన్ పరిస్థితి నేపథ్యంలో ప్రపంచ ప్రజలు అనేక కష్ట నష్టాలను భరించి.. ఇప్పుడిప్పుడే.. సాధారణ జీవితానికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే కోవిడ్ 19 సంక్రమణ ప్రపంచవ్యాప్తంగా మరోమారు ప్రకంపనలు సృష్టిస్తోంది. భారతదేశంలోనూ కరోనా మహామ్మారి చాపకింద నీరులా అంతర్లీనంగా పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇన్ఫెక్షన్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రజలు, అధికారయంత్రాంగం మళ్లీ భయాందోళనకు గురవుతున్నారు. గతంలో వచ్చిన కరోనా వేవ్ ప్రజలను తీవ్రంగా దెబ్బతీసింది. రోజురోజుకు సంఖ్య పెరుగుతుండడంతో ఇదెక్కడికి దారితీస్తుందోననే ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ కలిగిస్తోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 10,753 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, భారతదేశంలో 10,753 తాజా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. క్రియాశీల ఇన్‌ఫెక్షన్ల సంఖ్య 53,720కి చేరుకుంది. 27 మంది మరణించడంతో టోల్ 5,31,091కి చేరుకుంది.

వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4.42 కోట్లకు (4,42,23,211) పెరిగింది. అయితే కేసు మరణాల రేటు 1.19 వద్ద నమోదైంది. మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 220.66 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు ఇవ్వబడ్డాయి.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మరణాలు..
ఢిల్లీలో ఆరు మరణాలు, మహారాష్ట్రలో నాలుగు, రాజస్థాన్‌లో మూడు, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో ఒక్కొక్కటి చొప్పున మరణాలు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం..