AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు..పూర్తి వివరాలు

దేశవ్యాప్తంగా ఉగ్రరూపం ప్రదర్శిస్తూ..బుసలు కొడుతున్న కరోనా వైరస్..తెలుగు రాష్ట్రాలను కూడా వణికిస్తోంది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ వైరస్ పంజా విసురుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు..పూర్తి వివరాలు
Jyothi Gadda
|

Updated on: Jul 14, 2020 | 9:13 AM

Share

దేశవ్యాప్తంగా ఉగ్రరూపం ప్రదర్శిస్తూ..బుసలు కొడుతున్న కరోనా వైరస్..తెలుగు రాష్ట్రాలను కూడా వణికిస్తోంది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ వైరస్ పంజా విసురుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ రోజుకూ వెయ్యి నుంచి 2000 చేరువగానే కొత్తకేసులు నమోదువుతున్నాయి. తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 36,221కు చేరింది. కాగా, ఏపీలోనూ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 31,103కి చేరింది. తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి విజృంభణ కొనసాగుతోంది. సోమవారం కొత్తగా 1,550 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 36,221కు చేరినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసుల్లో 926 కేసులు జీహెచ్​ఎంసీ పరిధిలోనే బయటపడినట్లు తెలిపింది. రంగారెడ్డి జిల్లాలో 212 మందికి వైరస్‌ సోకింది. ఇక ఆ తర్వాత అత్యధిక కేసులతో కరీంనగర్‌ ముందు వరుసలో ఉంది.

కరీంనగర్‌లో ఏకంగా 86 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ తరువాతి స్థానంలో మేడ్చల్‌ 53, నల్గొండ జిల్లాలో 41, ఖమ్మంలో 38, కామారెడ్డిలో 33, సంగారెడ్డిలో 19, వరంగల్‌ అర్బన్‌లో 16, మహాబూబాబాద్‌, మహాబూబ్‌నగర్‌ జిల్లాల్లో 13 చొప్పున కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.

ఇక, భద్రాద్రి, జనగామ, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లో పదేసి కొత్త కేసులు నమోదు కాగా, వరంగల్‌ రూరల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో 8 కేసులు చొప్పున నమోదయ్యాయి. సిరిసిల్ల జిల్లాలో ఏడుగురికి వైరస్‌ సోకింది. భూపాలపల్లి, పెద్దపల్లి, మెదక్‌ జిల్లాల్లో ఆరు కేసులు… యాదాద్రి, గద్వాల్‌ జిల్లాల్లో 5 కొత్త కేసులు బయటపడ్డాయి. వికారాబాద్‌లో ముగ్గురు, నాగర్‌కర్నూల్‌లో ఇద్దరు మహమ్మారి బారిన పడ్డారు. నిర్మల్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌, వనపర్తి జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. సోమవారం 1,197 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు డిశ్చార్జి అయ్యిన వారి సంఖ్య 23,679కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 12,178 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా కారణంగా మరో 9 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 365కి చేరింది. సోమవారం మరో 11, 525 మందికి పరీక్షలు నిర్వహించారు. ఫలితంగా ఇప్పటి వరకు పరీక్షలు నిర్వహించిన వారి సంఖ్య.. లక్షా 81, 849 మంది చేరినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్: అటు, ఏపీలోనూ కరోనా పంజా విసురుతూనే ఉంది. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య కూడా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. సోమవారం 1919 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 19,247 శాంపిల్స్‌ని పరీక్షించగా 1919 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 1030 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 37 మంది ప్రాణాలు కోల్పోయారు.

అనంతపూర్‌లో ఆరుగురు, కర్నూలులో నలుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, కడపలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒకరు, విశాఖపట్టణంలో ఒకరు, విజయనగరంలో ఒకరు చనిపోయినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 28,255. కాగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 365కు పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 14,275కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 13,615 మంది చికిత్స పొందుతున్నారు.