నిండు గ‌ర్భిణీకి క‌రోనా..పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో వెలుగులోకి వ‌చ్చిన కరోనా పాజిటివ్‌ గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్‌లో పని చేస్తున్న రెసిడెంట్‌ డాక్టర్‌తో పాటు ఆమె భార్యకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.

నిండు గ‌ర్భిణీకి క‌రోనా..పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది

Updated on: Apr 04, 2020 | 1:31 PM

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో వెలుగులోకి వ‌చ్చిన కరోనా పాజిటివ్‌ గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్‌లో పని చేస్తున్న రెసిడెంట్‌ డాక్టర్‌తో పాటు ఆమె భార్యకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అయితే డాక్టర్‌ భార్య నిండు గర్భిణి. డాక్టర్‌తో పాటు ఆమెను ఇప్పటికే ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు శుక్రవారం రాత్రి పురిటినొప్పులు వచ్చాయి. మొత్తానికి ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

క‌రోనా వైర‌స్ సోకిన పెషేంట్‌ బిడ్డకు జన్మనివ్వడం దేశంలో ఇదే తొలిసారి. తల్లీబిడ్డ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కాగా, సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో పని చేస్తున్న ఇద్దరు డాక్టర్లకు, సర్దార్‌ వల్లభాయి హాస్పిటల్‌ డాక్టర్‌కు, ఢిల్లీ బస్తీ దవఖానాల్లో పని చేస్తున్న ఇద్దరు డాక్టర్లకు, క్యాన్సర్‌ ఆస్పత్రి వైద్యురాలికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం విధిత‌మే.