Telangana Corona Cases: తెలంగాణలో అదుపులోనే కరోనా.. కొత్తగా నమోదు అయిన కేసుల కన్నా కోలుకున్న వారే ఎక్కువ!

|

Jul 02, 2021 | 8:42 PM

Telangana Corona Cases: లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ తెలంగాణలో కరోనా రెండోవేవ్ అదుపులోనే ఉంది. రోజూవారీ నమోదు అవుతున్న కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో పాటు మరణాల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది.

Telangana Corona Cases: తెలంగాణలో అదుపులోనే కరోనా.. కొత్తగా నమోదు అయిన కేసుల కన్నా కోలుకున్న వారే ఎక్కువ!
Telangana Corona Cases
Follow us on

Telangana Corona Cases: లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ తెలంగాణలో కరోనా రెండోవేవ్ అదుపులోనే ఉంది. రోజూవారీ నమోదు అవుతున్న కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో పాటు మరణాల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. మరోపక్క తెలంగాణా వ్యాప్తంగా 1064 ర్యాపిడ్ అంటిజెన్ టెస్టింగ్ కేంద్రాలు, ప్రభుత్వ విభాగంలో ఆర్టిపీసీఆర్ టెస్టింగ్ కేంద్రాలు 21, ప్రయివేట్ రంగంలో 63 కేంద్రాలు నిరంతరాయంగా కోవిడ్ పరీక్షల కోసం పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాల్లో గత 24 గంటల్లో సేకరించిన నమూనాలపై జరిపిన పరీక్షల్లో గడిచిన 24 గంటల్లో వెయ్యికంటే తక్కువగా కేసులు నమోదు అయ్యాయి. అదేవిధంగా జిల్లాల వారీగా చూసుకుంటే అన్ని జిల్లాల్లోనూ కరోనా తగ్గుముఖం పడుతోంది. ఒకటి రెండు జిల్లాల్లో కొద్దిగా పెరిగినట్టు కనిపించినా అక్కడ స్థానిక అధికారులు వాటిని కట్టడి చేసే చర్యలు తీసుకుంటున్నారు.
ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ టెస్టింగ్ కేంద్రాల్లో 1,08,617 సాంపిల్స్ సేకరించారు. వీరిలో 858 మందికి పాజిటివ్ తేలింది. ఇక ఒక్కరోజులో కరోనా నుంచి 1,175 మంది కోలుకున్నారు. కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 9 గా నమోదు అయింది. గత 24 గంటల్లో నమోదైన కేసులు.. మరణాలు.. కోలుకున్న వారి లెక్కల ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో 2,726 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో కరోనా రికవరీల రేటు 97.37 శాతం ఉండగా.. మరణాల రేటు 0.58 శాతం ఉంది.

కాగా, తాజాగా నమోదైన కేసులతో కలిపి తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 6,25,237కు చేరింది. వీరిలో 6,08,833 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక వైరస్ ప్రభావంతో 3,678 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,86,85,647 మంది సాంపిల్స్ పరీక్షించారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 107 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆదిలాబాద్, నిర్మల్ లో అతి తక్కువగా రెండేసి కేసులు చొప్పున నమోదు అయ్యాయి.

జిల్లాల వారీగా నమోదు అయిన కరోనా కేసులు ఇలా ఉన్నాయి..
ఆదిలాబాద్ – 2
బద్రాద్రి కొత్తగూడెం – 30
జీహెచ్ఎంసీ – 107
జగిత్యాల – 18
జనగామ – 9
జయశంకర్ భూపాలపల్లి – 16
జోగులాంబ గద్వాల – 5
కామారెడ్డి – 3
కరీంనగర్ – 51
ఖమ్మం – 81
కొమరంభీం ఆసిఫాబాద్ – 4
మహబూబ్‌నగర్ – 18
మహబూబాబాద్ – 40
మంచిర్యాల – 41
మెదక్ – 7
మేడ్చల్ మల్కాజిగిరి – 39
ములుగు – 18
నాగర్ కర్నూల్ – 12
నల్లగొండ – 64
నారాయణ పేట – 4
నిర్మల్ – 2
నిజామాబాద్ – 6
పెద్దపల్లి – 36
రాజన్న సిరిసిల్ల – 22
రంగారెడ్డి – 51
సంగారెడ్డి – 12
సిద్దిపేట – 23
సూర్యాపేట – 52
వికారాబాద్ – 10
వనపర్తి – 7
వరంగల్ రూరల్ – 14
వరంగల్ అర్బన్ – 39
యాదాద్రి భువనగిరి – 15

Also Read: Ground Report On Mallepalli: ఆ”పరేషన్” మల్లేపల్లి.. అక్కడి పరిస్థితులపై టీవీ9 తెలుగు గ్రౌండ్ రిపోర్ట్

YS Sharmila: ఈ నెల 8న వైఎస్ షర్మిల పార్టీ ఆవిర్భావం.. రోడ్డు మ్యాప్ ఇదే(ఫోటో గ్యాలరీ)