
తెలంగాణపై కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం పాజటివ్ కేసుల సంఖ్య 4వేలు దాటింది. బుధవారం కొత్తగా 191 కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఈ మేరకు పూర్తి వివరాలు పరిశీలించగా…
రాష్ట్రంలో బుధవారం కొత్తగా 191 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల మరో 8 మంది మృతిచెందారు. కాగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 143 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మేడ్చల్ 11, సంగారెడ్డి 11, రంగారెడ్డి 8, మహబూబ్‌నగర్ 4, జగిత్యాల 3 , మెదక్ 3, నాగర్ కర్నూల్ 2, కరీంనగర్ 2 కేసులు కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్, వికారాబాద్, నల్గొండ, సిద్ధిపేట జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది.
రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,111కు చేరింది. కరోనా బారినపడి మృతిచెందిన వారి సంఖ్య 156కు పెరిగింది. ప్రస్తుతం 2,138 మంది రోగులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని 1817 మంది డిశ్చార్జ్ అయ్యారు.