కరోనా బాధితులకు ‘తలా’ భారీ విరాళం..

|

Apr 08, 2020 | 1:14 PM

Coronavirus Lockdown: కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటం చేస్తున్న కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా మేము సైతం అంటూ పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చి విరాళాలు అందజేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు విరాళాలు ప్రకటించడమే కాకుండా.. ‘కరోనా క్రైసెస్ ఛారిటీ’ని ఏర్పాటు చేసి పని లేకుండా పోయిన సినీ కార్మికుల కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కూడా నేను సైతం అంటూ ముందుకు వచ్చాడు. […]

కరోనా బాధితులకు తలా భారీ విరాళం..
Follow us on

Coronavirus Lockdown: కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటం చేస్తున్న కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా మేము సైతం అంటూ పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చి విరాళాలు అందజేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు విరాళాలు ప్రకటించడమే కాకుండా.. ‘కరోనా క్రైసెస్ ఛారిటీ’ని ఏర్పాటు చేసి పని లేకుండా పోయిన సినీ కార్మికుల కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కూడా నేను సైతం అంటూ ముందుకు వచ్చాడు.

తమిళ సూపర్ స్టార్ ‘తలా’ అజిత్ తన వంతుగా రూ.1.25 కోట్లు విరాళంగా ప్రకటించాడు. ఇందులో పీఎం కేర్స్ ఫండ్‌కు రూ. 50 లక్షలు, తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు, ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాకు రూ. 25 లక్షలు ప్రకటించాడు. ఇక తమిళనాట ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతోంది. తలా ఫ్యాన్స్ తమ హీరో మంచితనం గురించి సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తుండటంతో ట్విట్టర్లో #PerfectCitizenThalaAjith అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది. కాగా, కోలీవుడ్ నుంచి ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్ – సూర్య ఫ్యామిలీ – శివ కార్తికేయన్ మొదలైన వారు కరోనా పై యుద్ధానికి మేముసైతం అంటూ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

For More News:

ఏపీలో దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేత..!

గతేడాది మార్చి బిల్లు కడితే చాలు.. టీఎస్ఈఆర్సీ ఆదేశాలు..

చికెన్ వ్యాపారికి కరోనా పాజిటివ్.. విశాఖలో టెన్షన్..

‘విక్రమ్‌వేద’ రీమేక్‌లో పవన్, రవితేజ.. ముహూర్తం ఫిక్స్..!

ఆ బొమ్మ ఇప్పటికీ నా దగ్గరే ఉంది – చిరంజీవి

దేశంలో 5 వేలు దాటిన కరోనా కేసులు.. మహారాష్ట్ర మొదటి స్థానం..

వారం పనిచేస్తే 14 రోజుల సెలవులు.. జగన్ సర్కార్ నిర్ణ‌యం.!

ఏపీలో టెన్త్ విద్యార్ధులకు గుడ్ న్యూస్..

లాక్ డౌన్ ఎఫెక్ట్.. వీధి కుక్కల్లో వింత ప్రవర్తన.. రసాయనాలు తట్టుకోలేక మృతి..