లాక్‌డౌన్ 3.0.. జోన్లు వారీగా నిబంధనలు ఇవే..
రెండోదశ లాక్ డౌన్ మరో రెండు రోజుల్లో ముగియనుండగా.. కేంద్రం ఊహించని విధంగా సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా లాక్ డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మే 17 వరకు రెడ్ జోన్లలో పూర్తి స్థాయిలో ఆంక్షలతో కూడిన లాక్ డౌన్ కొనసాగుతుందని.. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మాత్రం కొన్ని సడలింపులు ఉంటాయని పేర్కొంది. అయితే జోన్లతో సంబంధం లేకుండా విమాన, రైళ్లు, మెట్రో సర్వీసులను నడపకూడదని […]

రెండోదశ లాక్ డౌన్ మరో రెండు రోజుల్లో ముగియనుండగా.. కేంద్రం ఊహించని విధంగా సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా లాక్ డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మే 17 వరకు రెడ్ జోన్లలో పూర్తి స్థాయిలో ఆంక్షలతో కూడిన లాక్ డౌన్ కొనసాగుతుందని.. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మాత్రం కొన్ని సడలింపులు ఉంటాయని పేర్కొంది. అయితే జోన్లతో సంబంధం లేకుండా విమాన, రైళ్లు, మెట్రో సర్వీసులను నడపకూడదని స్పష్టం చేసింది. ఆరెంజ్ జోన్లలో డ్రైవర్, ఒక్క ప్రయాణీకుడితో క్యాబ్స్, బైక్‌పై ఒకరు వెళ్ళొచ్చునని చెప్పింది. అటు అన్ని జోన్లలోనూ ఆసుపత్రుల్లో ఓపీ సేవలకు అనుమతి ఇచ్చింది. కాగా, జోన్ల వారీగా రూల్స్ ఇలా ఉన్నాయి.
ఆరెంజ్ జోన్ ఆంక్షలు:
- కార్లలో ఇద్దరు ప్యాసింజర్లతో అనుమతి
- వ్యక్తిగత వాహనాలకు అనుమతి
- టూ వీలర్ మీద ఒక్కరికే అనుమతి
- వ్యక్తిగత ప్రయాణాలపై ఆంక్షలు ఉండవు
- అన్ని వ్యవసాయ పనులకు అనుమతి
- షరతులతో ప్రైవేట్ క్యాబ్‌లకు అనుమతి
గ్రీన్ జోన్ ఆంక్షలు..
- సాధారణ కార్యకలాపాలకు అనుమతి
- పరిమిత సంఖ్యలో బస్సు సర్వీసులకు ఓకే
- వ్యవసాయ పనులకు అనుమతి
- వ్యక్తిగత ప్రయాణాలకు ఆంక్షలు ఉండవు
- ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి
- రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ ఉంటుంది
- జిల్లా మధ్య రాకపోకలకు అనుమతి
- వైన్, పాన్ షాపులకు అనుమతి
జోన్లతో సంబంధం లేకుండా అనుమతి లేనివి:
- ప్రజా రవాణా బంద్
- స్కూల్స్, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు నిషేధం
- హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్ళు, జిమ్‌లు బంద్
- స్విమ్మింగ్ పూల్స్, స్టేడియంలు మూసి ఉంటాయి
- అన్ని మతపరమైన, రాజకీయ ఈవెంట్లు బంద్
- ప్రార్ధన మందిరాలు మూసి ఉంటాయి
coronavirus lockdownCoronavirus Lockdown ExtendedCoronavirus Lockdown Extended Till May 17Coronavirus Lockdown Until May 17Coronavirus Outbreak In India