లాక్ డౌన్ ఎఫెక్ట్.. వీధి కుక్కల్లో వింత ప్రవర్తన.. రసాయనాలు తట్టుకోలేక మృతి..

లాక్ డౌన్ ఎఫెక్ట్.. వీధి కుక్కల్లో వింత ప్రవర్తన.. రసాయనాలు తట్టుకోలేక మృతి..

Coronavirus Lockdown: కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడంలో భాగంగా కేంద్రం 21 రోజుల పాటు దేశవ్యాప్త లాక్ డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ పరిస్థితిలో ఆ ప్రభావం వీధి కుక్కలపై పడినట్లు నిపుణులు, యానిమల్ యాక్టివిస్టులు అభిప్రయపడుతున్నారు. మన దేశంలో 130 కోట్ల జనాభాతో పాటు సుమారు 40 లక్షల వీధి కుక్కలు జీవిస్తున్నాయి. దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా జనం రోడ్లపై సంచారం చేయకపోవడంతో కొన్ని వీధి కుక్కలు […]

Ravi Kiran

|

Apr 08, 2020 | 1:12 PM

Coronavirus Lockdown: కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడంలో భాగంగా కేంద్రం 21 రోజుల పాటు దేశవ్యాప్త లాక్ డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ పరిస్థితిలో ఆ ప్రభావం వీధి కుక్కలపై పడినట్లు నిపుణులు, యానిమల్ యాక్టివిస్టులు అభిప్రయపడుతున్నారు.

మన దేశంలో 130 కోట్ల జనాభాతో పాటు సుమారు 40 లక్షల వీధి కుక్కలు జీవిస్తున్నాయి. దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా జనం రోడ్లపై సంచారం చేయకపోవడంతో కొన్ని వీధి కుక్కలు కన్ఫ్యూజన్‌లోకి వెళ్ళిపోతున్నాయని యానిమల్ యాక్టివిస్టులు అంటున్నారు. అలాగే కొన్ని కుక్కల ప్రవర్తనలో కూడా స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయని ఢిల్లీకి చెందిన యానిమల్ బిహేవియరిస్ట్ ఆకాంక్ష యాదవ్ చెప్పారు.

అటు లాక్ డౌన్ కారణంగా ఆహార కొరత ఏర్పడటంతో ఉన్న కొంచెం తిండి కోసం వీధి కుక్కల మధ్య కొట్లాటలు సాగుతున్నాయని ఆమె అన్నారు. వీధి కుక్కలు ముఖ్యంగా మనుషులపైనే ఆధారపడతాయి. అవి ఎక్కువగా టిఫిన్ బండ్లు, సూపర్ మార్కెట్లు, మటన్ దుకాణాలు వంటి రద్దీ ఉన్న ప్రదేశాల్లోనే ఉంటాయి. ఇక ఇప్పుడు అవన్నీ మూతపడటంతో అవి కష్టకాలాన్ని అనుభవిస్తున్నాయని ఆకాంక్ష తెలిపారు.

మరోవైపు కొన్ని నగరాల్లో అయితే కుక్కలు తిండి దొరక్క మాయమైపోతున్నాయన్నారు. అయితే జన సంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో తిరిగే కుక్కలు మాత్రం ప్రస్తుత పరిస్థితిని కూల్‌గా ఎంజాయ్ చేస్తాయని ఢిల్లీ చత్తర్‌పూర్ ఏరియాలో డాగ్ ట్రైనింగ్ సెంటర్ నిర్వహించే అద్నాన్ ఖాన్ తెలిపారు. ఇక గ్రామాల్లో పారిశుద్ధ్యం కోసం చల్లుతున్న బ్లీచింగ్‌ పౌడర్‌, స్ప్రేకు తట్టుకోలేక కొన్ని కుక్కులు మృత్యువాత పడుతున్నాయన్నారు.

For More News:

ఏపీలో దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేత..!

గతేడాది మార్చి బిల్లు కడితే చాలు.. టీఎస్ఈఆర్సీ ఆదేశాలు..

కరోనా బాధితులకు ‘తలా’ భారీ విరాళం..

చికెన్ వ్యాపారికి కరోనా పాజిటివ్.. విశాఖలో టెన్షన్..

‘విక్రమ్‌వేద’ రీమేక్‌లో పవన్, రవితేజ.. ముహూర్తం ఫిక్స్..!

ఆ బొమ్మ ఇప్పటికీ నా దగ్గరే ఉంది – చిరంజీవి

దేశంలో 5 వేలు దాటిన కరోనా కేసులు.. మహారాష్ట్ర మొదటి స్థానం..

వారం పనిచేస్తే 14 రోజుల సెలవులు.. జగన్ సర్కార్ నిర్ణ‌యం.!

ఏపీలో టెన్త్ విద్యార్ధులకు గుడ్ న్యూస్..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu