భవనంపై నుంచి దూకి.. కరోనా అనుమానితుడు ఆత్మహత్యాయత్నం..!

ఢిల్లీలో కరోనా అనుమానితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎయిమ్స్‌ జై ప్రకాశ్‌ నారాయణ్‌ అపెక్స్‌ ట్రామా సెంటర్ భవంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి అతడు ప్రయత్నించాడు.

భవనంపై నుంచి దూకి.. కరోనా అనుమానితుడు ఆత్మహత్యాయత్నం..!

Edited By:

Updated on: Apr 05, 2020 | 5:49 PM

ఢిల్లీలో కరోనా అనుమానితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎయిమ్స్‌ జై ప్రకాశ్‌ నారాయణ్‌ అపెక్స్‌ ట్రామా సెంటర్ భవంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి అతడు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడి కాలు విరిగింది. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కరోనా లక్షణాలతో అతడు మార్చి 31న ఆసుపత్రికి రాగా.. పరీక్షలు నిర్వహించామని, రిపోర్టులు రావాల్సి ఉందని వైద్యులు తెలిపారు.

ఇదిలా ఉంటే కరోనా సోకిందనే నిందలు భరించలేక ఓ సంపూర్ణ ఆరోగ్యవంతుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. ఆయనకు జరిపిన పరీక్షల్లో కరోనా లేదని తెలిసినప్పటికీ.. అతడు నివసిస్తోన్న కాలనీవాసులు నిందలు వేస్తుండటంతో.. వాటిని భరించలేకపోయిన ముస్తఫా అనే వ్యక్తి గూడ్స్‌ రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. కరోనా నిందల వల్ల ఓ వ్యక్తి మరణించడం బహుశా దేశంలో ఇదే తొలిసారి అంటూ మధురై పార్లమెంట్​ సభ్యుడు ఎస్​ వెంకటేశన్​ ట్విట్టర్​లో పేర్కొన్నారు.

Read This Story Also: పెళ్లి వార్తలపై స్పందించిన ‘మహానటి’.. ఏమందంటే..!