పెళ్లి వార్తలపై స్పందించిన ‘మహానటి’.. ఏమందంటే..!

కీర్తి సురేష్‌ పెళ్లి పీటలెక్కబోతోందని.. ఓ జాతీయ పార్టీ నేత కుమారుడితో మహానటి వివాహాన్ని కుటుంబ సభ్యులు ఫిక్స్‌ చేశారని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ ఏడాదిలోనే ఆమె పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ముహూర్తం ఫిక్స్ చేశారని కూడా టాక్ నడిచింది. ఇక ఈ పుకార్లు ఆమె వద్దకు వెళ్లడంతో తాజాగా వాటిపై క్లారిటీ ఇచ్చేసింది. ఆ వార్తలను చూసి తనకు నవ్వొచ్చిందని తెలిపిన కీర్తి.. ప్రస్తుతం తాను సినిమాలతో బిజీగా ఉన్నానని […]

పెళ్లి వార్తలపై స్పందించిన 'మహానటి'.. ఏమందంటే..!
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో మహేష్ కు జోడీ గా నటిస్తుంది ఈ మహానటి. 
Follow us

| Edited By:

Updated on: Apr 05, 2020 | 5:11 PM

కీర్తి సురేష్‌ పెళ్లి పీటలెక్కబోతోందని.. ఓ జాతీయ పార్టీ నేత కుమారుడితో మహానటి వివాహాన్ని కుటుంబ సభ్యులు ఫిక్స్‌ చేశారని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ ఏడాదిలోనే ఆమె పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ముహూర్తం ఫిక్స్ చేశారని కూడా టాక్ నడిచింది. ఇక ఈ పుకార్లు ఆమె వద్దకు వెళ్లడంతో తాజాగా వాటిపై క్లారిటీ ఇచ్చేసింది. ఆ వార్తలను చూసి తనకు నవ్వొచ్చిందని తెలిపిన కీర్తి.. ప్రస్తుతం తాను సినిమాలతో బిజీగా ఉన్నానని పేర్కొన్నారు. క్యాల్షీట్లు నిండుగా ఉంటే.. పెళ్లి చేసుకునే సమయం తనకు ఎక్కడుందంటూ కీర్తి స్పష్టతను ఇచ్చేసింది. ఆ పుకార్లలో ఎలాంటి నిజం లేదని చెప్పేసింది.

కాగా ప్రస్తుతం కీర్తి సురేష్‌ తెలుగులో ‘రంగ్‌దే’, ‘గుడ్‌లక్‌ సఖి’, ‘మిస్ ఇండియా’ చిత్రాలతో పాటు తమిళ్‌లో రజనీకాంత్ ‘అన్నాత్తే’, ‘పెంగ్విన్‌’, మలయాళంలో ‘మరక్కర్‌’ చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు మరికొందరు దర్శకులు కీర్తితో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

Read This Story Also: ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్ కోసం స్పెషల్‌ ప్రమోషన్స్‌..!