
దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా యాభై వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. అయితే అదే సమయంలో రోజుకు కొందరు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతుండటం ఊరటనిస్తోంది. తాజగా గురువారం రాష్ట్రంలో నమోదైన కేసుల వివరాలను ఆరోగ్య శాఖ వెల్లడించింది. గురువారం నాడు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాని పేర్కొంది. ఈ కేసుల్లో గ్రేటర్ హైదరబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోనే పన్నెండు నమోదదైనట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు. ఇక మరో మూడు కేసులు వలస కూలీలవని ఆరోగ్య శాఖ వెల్లడించింది. గురువారం నమోదైన కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,122కి చేరింది. గురువారం నాడు కరోనా నుంచి కోలుకుని 45 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఆరోగ్య శాఖ బులిటెన్‌లో ప్రకటించింది. ప్రస్తుతం 400 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.(Dated. 07.05.2020)#StayHomeStaySafe pic.twitter.com/SfPDpM0gnx
— Eatala Rajender (@Eatala_Rajender) May 7, 2020