Coronavirus: దేశంలో కరోనా టెర్రర్.. పార్లమెంట్​లో 350 మందికి పాజిటివ్

|

Jan 08, 2022 | 9:15 PM

భారత్ పార్లమెంట్‌లో కరోనా కలకలం రేపింది. దేశవ్యాప్తంగా టెర్రర్ క్రియేట్ చేస్తోన్న వేళ పార్లమెంట్‌లో కూడా కరోనా కలకలం రేపింది.

Coronavirus:  దేశంలో కరోనా టెర్రర్.. పార్లమెంట్​లో  350 మందికి పాజిటివ్
Follow us on

భారత్ పార్లమెంట్‌లో కరోనా కలకలం రేపింది. దేశవ్యాప్తంగా టెర్రర్ క్రియేట్ చేస్తోన్న వేళ పార్లమెంట్‌లో కూడా కరోనా కలకలం రేపింది. రెండ్రోజులుగా పార్లమెంటు సిబ్బందికి నిర్వహిస్తున్న కరోనా పరీక్షల్లో 350 మందికిపైగా కరోనా పాజిటివ్​ అని నిర్ధారణ అయ్యింది. వైరస్​ బారిన పడినవారు హోం క్వారంటైన్​లో ఉంటారని అధికారులు వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి శరవేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కీలక సూచనలు చేసింది WHO. కరోనా ఆంక్షలను క్షేత్రస్థాయిలో కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఒమిక్రాన్ అంత ప్రమాదకరమైనది కాదని నిపుణులు చెబుతున్నా, అప్రమత్తత అవసరమని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తిచెందకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎక్కడికక్కడ కఠిన నిబంధనలను అమలు చేయాలని స్పష్టం చేసింది WHO. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వెంటిలేషన్​, భౌతికదూరం వంటి రూల్స్​ను కచ్చితంగా పాటించాల్సిందే అని తేల్చిచెప్పింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అన్ని కొవిడ్ కేసులు ఒమిక్రాన్ కేసులు కాదని, అందులో డెల్టా వేరియంట్ కూడా ఉంటుందని హెచ్చరించింది. అటు ఫిబ్రవరి నాటికి భారత్​లో కొవిడ్ థర్డ్‌ వేవ్ తీవ్ర స్థాయికి చేరుతుందని అంచనా వేస్తున్నారు అమెరికా వైద్య నిపుణులు. రోజుకు ఐదు లక్షల కేసులు వచ్చే అవకాశం ఉందని లెక్కగట్టారు. డెల్టాతో పోలిస్తే ఈ వేరియంట్ ప్రభావం తక్కువగానే ఉంటుందని, తీవ్రమైన వ్యాధి నుంచి వ్యాక్సినేషన్ కాపాడుతుందని అంటున్నారు నిపుణులు.  ఢిల్లీ, ముంబై, కలకత్తా వంటి మెంట్రో నగరాల్లోనూ కొవిడ్‌ విజృంభిస్తోంది. దీంతో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు చేపట్టాలని ఆదేశిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.

Also Read: వివాహేతర సంబంధం ఎఫెక్ట్.. సచివాలయంలో ఇద్దరు మహిళల ఫైటింగ్

రోబోతో ప్రేమలో పడ్డ వ్యక్తి.. తానులేక, నేను లేనంటూ ప్రేమ గీతాలు.. త్వరలో పెళ్లి!