Coronavirus: దేశంలో మళ్లీ కోరలు చాస్తోన్న కరోనా.. మహారాష్ట్రలోనూ పెరుగుతున్న బాధితులు.. నిన్న మొత్తం ఎన్ని కేసులంటే..

|

May 06, 2022 | 11:42 AM

దేశంలో కరోనా వైరస్ (Coronavirus) మళ్లీ కోరలు చాస్తోంది. గతవారం రోజులుగా రోజువారీ కేసులు 3వేలకు ఎగువనే నమోదవుతుండడం, ఢిల్లీతో పాటు మహారాష్ట్రలోనూ భారీగా కొత్త కేసులు వెలుగుచూడడం వైరస్‌ తీవ్రతకు అద్దం

Coronavirus: దేశంలో మళ్లీ కోరలు చాస్తోన్న కరోనా.. మహారాష్ట్రలోనూ పెరుగుతున్న బాధితులు.. నిన్న మొత్తం ఎన్ని కేసులంటే..
Follow us on

దేశంలో కరోనా వైరస్ (Coronavirus) మళ్లీ కోరలు చాస్తోంది. గతవారం రోజులుగా రోజువారీ కేసులు 3వేలకు ఎగువనే నమోదవుతుండడం, ఢిల్లీతో పాటు మహారాష్ట్రలోనూ భారీగా కొత్త కేసులు వెలుగుచూడడం వైరస్‌ తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 4.65 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 3,545 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. ఇవి బుధవారం నాటి కేసుల కంటే 8.2 శాతం ఎక్కువ కావడం గమనార్హం. అత్యధికంగా ఢిల్లీలో 1,365 మందికి వైరస్ నిర్ధారణ కాగా మహారాష్ట్రంలో 200పై చిలుకు కొత్త కేసులు నమోదయ్యాయి. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ (Central Health Ministry) శుక్రవారం కొవిడ్‌ గణాంకాలను వెల్లడించింది.

తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసులు 4,30,94,938కు చేరాయి. అదేవిధంగా గురువారం మరో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా కారణంగా ఇప్పటి వరకూ 5.24 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 19,688 కరోనా క్రియాశీల కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 0.76 శాతానికి చేరుకోగా.. వీక్లీ పాటిజివిటీ రేటు 0.79కి చేరుకుంది. ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో 3,549 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో రికవరీల వాటా 98.74 శాతంగా ఉంది. ఇక కరోనా కట్టడికి దేశంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. నిన్న 16.5 లక్షలమందికి టీకా ఇవ్వగా. ఇప్పటివరకు189 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని కరోనా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

Edible Oils: గుడ్‌న్యూస్‌.. దిగిరానున్న వంట నూనెల ధరలు.. కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం..

Nap at Office: ఆఫీసులో ఉద్యోగులు మధ్యాహ్నం ఓ అరగంటపాటు ఓ కునుకు తీయొచ్చు.. ఓ స్టార్టప్‌ కంపెనీ వినూత్న నిర్ణయం..

MLC Kavitha: తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేశారా? రాహుల్ గాంధీ పర్యటనపై ఎమ్మెల్సీ కవిత వ్యంగాస్త్రాలు..