భారత్ లాక్‌డౌన్‌.. ట్రెండ్‌ అవుతోన్న జోఫ్రా ఆర్చర్ ట్వీట్.. నెటిజన్ల విభిన్న కామెంట్లు..!

కరోనా వ్యాప్తిని నియంత్రించే క్రమంలో 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 14వరకు ఈ లాక్‌డౌన్‌ ఉండబోతుందని ఆయన వెల్లడించారు.

భారత్ లాక్‌డౌన్‌.. ట్రెండ్‌ అవుతోన్న జోఫ్రా ఆర్చర్ ట్వీట్.. నెటిజన్ల విభిన్న కామెంట్లు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 24, 2020 | 10:25 PM

కరోనా వ్యాప్తిని నియంత్రించే క్రమంలో 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 14వరకు ఈ లాక్‌డౌన్‌ ఉండబోతుందని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ వేసిన పాత ట్వీట్ ఒకటి ట్రెండ్ అవుతోంది. ఇంటి పట్టునే మూడు వారాలు సరిపోతాయా..? అంటూ 2017 అక్టోబర్ 23న అతడు వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్ల నుంచి విభిన్న కామెంట్లు వస్తున్నాయి. ఇప్పటి నుంచి మీ పేరు జ్యోత్సి జయ శంకర్ ఆచార్య అని ఒకరు కామెంట్ పెట్టగా.. మరో నెటిజన్ తన పుట్టిన తేదీ, సమయం పెట్టి.. లైఫ్‌ టైమ్ ఎలా ఉంటుందో చెప్పండి అని కామెంట్ పెట్టారు. మరో సీఏ స్టూడెంట్.. ఐసీఏఐ మే 2020న జరగనున్న పరీక్షలు వాయిదా పడతాయా..? అని ప్రశ్నించారు. మరో నెటిజన్‌ సార్ అప్పుడైనా తగ్గిపోతుందా..? అని అడిగారు. ఇంకో నెటిజన్‌ డ్యూడ్ మీరు తప్పు వృత్తిలో ఉన్నారు అంటూ కామెంట్ పెట్టారు.

అయితే భవిష్యత్‌ను ముందే ఊహించి.. గతంలోనూ ఆర్చర్ చేసిన పలు ట్వీట్లు వైరల్‌గా మారాయి. ముఖ్యంగా పృథ్వీ షాపై వేటు.. ఆర్టికల్ 370 రద్దు గురించి ఆర్చర్ ట్వీట్ వేయగా.. అవి వైరల్ అయిన విషయం తెలిసిందే.

Read This Story Also: ప్రధాని మాట పాటిద్దాం.. పవన్ కల్యాణ్‌ పిలుపు..!