WHO హెచ్చ‌రికః క‌రోనా విశ్వ‌రూపం చూపించ‌నుంది..!

యావత్ మానవజాతిని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ మరింతగా భయపెడుతోంది. ఈ మహమ్మారి ఒక రూపాన్ని మాత్రమే ఇప్పుడు మనం చూస్తున్నామని.. దాని మరోరూపం చాలా దారుణంగా ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ హెచ్చరించారు. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 2.5 మిలియన్ల మందికి సోకినా ఈ వైరస్ కారణంగా 1.70కి పైగా ప్రజలు మృత్యువాతపడ్డారు. ఇక మున్ముందు ఈ వైరస్ వ్యాప్తి మరింత దారుణంగా ఉంటుందని.. ఆరోగ్య వ్యవస్థలు […]

WHO హెచ్చ‌రికః క‌రోనా విశ్వ‌రూపం చూపించ‌నుంది..!

Updated on: Apr 22, 2020 | 1:49 PM

యావత్ మానవజాతిని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ మరింతగా భయపెడుతోంది. ఈ మహమ్మారి ఒక రూపాన్ని మాత్రమే ఇప్పుడు మనం చూస్తున్నామని.. దాని మరోరూపం చాలా దారుణంగా ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ హెచ్చరించారు. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 2.5 మిలియన్ల మందికి సోకినా ఈ వైరస్ కారణంగా 1.70కి పైగా ప్రజలు మృత్యువాతపడ్డారు. ఇక మున్ముందు ఈ వైరస్ వ్యాప్తి మరింత దారుణంగా ఉంటుందని.. ఆరోగ్య వ్యవస్థలు తక్కువగా అభివృద్ధి చెందినా ఆఫ్రికా దేశాల ద్వారా ఈ ఇది మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ అంచనా వేసిందని ఆయన అంటున్నారు.

‘మమ్మల్ని నమ్మండి.. మరికొన్ని రోజుల్లో పరిస్థితి దారుణంగా మారబోతోందని టెడ్రోస్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారిక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘ఈ వైరస్‌ను ఎలాగైనా నియంత్రించాలి. ఇప్పటివరకు చాలామంది ప్రజలకు అసలు కరోనా గురించే అర్ధం కావట్లేదని ఆయన అన్నారు. 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూకి.. కరోనాకు మధ్య ఎన్నో సారూప్యాలున్నాయని.. ఆ ఫ్లూ తరహాలోనే కరోనా సైతం నెమ్మదిగా పంజా విసిరి మరణ మృదంగం సృష్టిస్తుందని హెచ్చరించారు. అందుచేత అన్ని దేశాలూ కూడా కలిసికట్టుగా ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు పోరటం చేయాలనీ టెడ్రోస్ పిలుపునిచ్చారు.

Also Read:

కిమ్ కంటే యమ డేంజరట.. ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

జూన్ 1 వరకూ లాక్‌డౌన్‌.. సర్కార్ కీలక నిర్ణయం..

కరోనా వేళ.. పాక్‌కు గట్టి షాక్.. క్వారంటైన్‌కు ఇమ్రాన్ ఖాన్.!

మనసున్న మారాజు.. పేదవాళ్లకు అద్దె మాఫీ చేసిన టీఆర్ఎస్ నేత..

లాక్‌డౌన్‌ నుంచి వీటికి కూడా మినహాయింపు.. కేంద్రం తాజా ఆదేశాలు..

లాక్‌డౌన్‌ బేఖాతర్.. వందల సంఖ్యలో గుమిగూడి కరోనా పూజలు..

అక్కడ లాక్ డౌన్ పాటించకపోతే.. రూ. 23,000 ఫైన్…

పాఠశాలలకు సెలవులు పొడిగించిన ఏపీ ప్రభుత్వం..

లాక్‌డౌన్ వేళ.. ఎయిర్ అంబులెన్స్‌లో తొలిసారి భారత్‌కు..

సాహో ఇండియా.. భారతీయ డాక్టర్‌కు సలాం చేసిన అమెరికన్లు.. వీడియో వైరల్..