కరోనా ఎఫెక్ట్: ఒక్కసారిగా పెరిగిన కూరగాయల ధరలు.. రేట్లు చూస్తే గుండె గుబేలే

| Edited By:

Mar 23, 2020 | 3:03 PM

తెలంగాణలో ఒక్కసారిగా కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో వ్యాపారులు అందినకాడికి బాగా దోచుకుంటున్నారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్, మోహిదీ పట్నం, బోయిన్‌పల్లి మార్కెట్లలో రేట్లు చూస్తే సామాన్యుడి గుండె గుబేల్‌..

కరోనా ఎఫెక్ట్: ఒక్కసారిగా పెరిగిన కూరగాయల ధరలు.. రేట్లు చూస్తే గుండె గుబేలే
Follow us on

తెలంగాణలో ఒక్కసారిగా కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో వ్యాపారులు అందినకాడికి బాగా దోచుకుంటున్నారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్, మోహిదీ పట్నం, బోయిన్‌పల్లి మార్కెట్లలో రేట్లు చూస్తే సామాన్యుడి గుండె గుబేల్‌ అవక తప్పదు. కరోనా వైరస్ తీవ్రంగా ప్రబలడంతో.. ప్రజలందరూ నాన్ వెజ్ తినడం మానేశారు. అందులోనూ ముఖ్యంగా చికెన్ జోలికి వెళ్లడమే లేదు. రెండు తెలుగు రాష్ట్రాలనూ లాక్‌డౌన్ చేయడంతో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ఇదే అదునుగా భావించిన.. కూరగాయల దుకాణాదారులు ధరలను విపరీతంగా పెంచేశారు. గత రెండు, మూడు రోజుల క్రితం పది రూపాయలకు 3 కిలోల టమాటాలు వచ్చేవి. కానీ ఇప్పుడు కిలో రూ.60ల నుంచి 80ల వరకూ పలుకుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే కూరగాయలు కిలో రూ.100లు అయినా ఆశ్చర్యం లేనక్కర్లేదంటున్నాయి మార్కెట్ వర్గాలు.

దేశ వ్యాప్తంగా రోజురోజుకీ మరింతగా విజృంభిస్తోంది కరోనా వైరస్. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా 250కి పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో.. ముందుగానే భారత్‌లో వైరస్‌ని కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం దేశంలో స్టేజ్-2 నడుస్తుందని.. స్టేజ్-3కి వెళ్తే.. పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని పేర్కొంటున్నారు. దీంతో ముందస్తుగానే ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలనూ లాక్‌డౌన్ చేశారు సీఎంలు. అలాగే ప్రజా రవాణా రద్దు చేశామని, ఇంటి బయటికి రావొద్దని, ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశాయి ప్రభుత్వాలు. అత్యవసర సేవలు మినహా ఏ సంస్థలు, దుకాణాలు కూడా పని చేయవని స్పష్టం చేశాయి. దీంతో మరింత జాగ్రత్తలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే పలు కీలక సూచనలు కూడా జారీ చేశారు. అలాగే.. ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీని కల్పించారు అధికారులు. దేశవ్యాప్తంగా ఉన్న స్కూల్స్, కాలేజీలు, థియేటర్లు, మాల్స్, షాపింగ్ మాల్స్‌ అన్నింటినీ మూసివేశారు.

Read more also: రీజన్ లేకుండా.. రోడ్డెక్కితే అంతే.. ప్రజలకు సీరియస్ వార్నింగ్

మీరు సూపరంటూ కేసీఆర్‌ని పొగిడేసిన అమిత్‌ షా

కరోనాను జయించాలంటే.. ఈ డైట్‌ని మెయిన్‌టైన్ చేయాల్సిందే

కరోనా రూపంలో.. చిత్ర సీమకు తీవ్ర నష్టం

నగదు.. బియ్యం పంపిణీ ఎలా చేస్తారు?