Corona deaths: ఒకేరోజు మూడు మరణాలు.. దేశంలో ‘కరోనా’ ముదురుతోందా..!

| Edited By:

Mar 22, 2020 | 4:59 PM

దేశంలో మరో కరోనా మరణం నమోదైంది. గుజరాత్‌లోని సూరత్‌లో కరోనాతో 69ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. దీంతో కరోనా మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది.

Corona deaths: ఒకేరోజు మూడు మరణాలు.. దేశంలో కరోనా ముదురుతోందా..!
Follow us on

దేశంలో మరో కరోనా మరణం నమోదైంది. గుజరాత్‌లోని సూరత్‌లో కరోనాతో 69ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. దీంతో కరోనా మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. అంతేకాదు ఇవాళ ఒక్కరోజే మూడు కరోనా మరణాలు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో ఒకటి, బీహార్ లో మరోకటి.. తాజాగా గుజరాత్ లో ఓ మృతి నమోదైంది. దీంతో అందరిలో ఆందోళనను కలిగిస్తోంది. దేశంలో కరోనా ముదురుతున్నట్లుగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక కరోనా వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునివ్వగా.. దాన్ని పొడిగించాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అలాగే కోవిడ్‌ను అరికట్టడం కోసం మార్చి 31 వరకు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్/మెయిల్ రైళ్లు, ఇంటర్‌సిటీ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లను నిలిపేస్తున్నట్లు భారత రైల్వేస్ తెలిపింది. మెట్రో రైళ్ల సేవలు కూడా ఈ నెలాఖరు వరకు నిలిచిపోనున్నాయి. ఇక కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న 75 జిల్లాలను మర్చి 31 వరకు లాక్ డైన్ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Read This Story Also: రక్తసిక్తమైన ‘సుక్మా’.. మిస్సైన 17మంది జవాన్ల మృతదేహాలు లభ్యం