వెయ్యి పడకల ఆస్పత్రిని మూసేసిన చైనా

| Edited By:

Apr 16, 2020 | 9:14 AM

కరోనా వైరస్ పురుడు పోసుకున్న వూహాన్‌లో ఈ ఆస్పత్రిని నిర్మించింది చైనా ప్రభుత్వం. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ఆస్పత్రులను చైనా మూసేసిందంట. చైనాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిపోవడంతో...

వెయ్యి పడకల ఆస్పత్రిని మూసేసిన చైనా
Follow us on

కరోనా వైరస్‌ని అరికట్టడానికి చైనా ప్రభుత్వం పది రోజుల్లో వెయ్యి పడకల సామర్థ్యం ఉన్న రెండు ఆస్పత్రులను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చర్యతో ప్రపంచమంతా చైనాను ప్రశంసించింది. కరోనా వైరస్ పురుడు పోసుకున్న వూహాన్‌లో ఈ ఆస్పత్రిని నిర్మించింది చైనా ప్రభుత్వం. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ఆస్పత్రులను చైనా మూసేసిందంట. చైనాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చైనా ప్రభుత్వ మీడియా జిన్హువా వెల్లడించింది.

గతేడాది డిసెంబర్‌లో హుబై ప్రావిన్స్‌లోని వూహాన్ నగరంలో కరోనా వైరస్ విజృంభించింది. దీంతో ఫిబ్రవరిలో వూహాన్‌ నగరంలో చైనా ప్రభుత్వం కేవలం 10 రోజుల్లో వెయ్యి పడకల సామర్థ్యం గల రెండు ఆస్పత్రులను నిర్మించింది. దేశం నలుమూలల నుంచి వేలాదిమంది డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది ఇక్కడికి వచ్చి కరోనా వైరస్ బాధితులకు చికిత్స చేశారు. కరోనా వ్యాప్తి అరికట్టడానికి చైనా ప్రభుత్వం జనవరి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 8 వరకూ లాక్‌డౌన్ అమలు చేసింది.

అయితే ఇప్పుడు మళ్లీ చైనాలో కరోనా నెగిటివ్ పేషంట్లకు మళ్లీ పాజిటివ్ వస్తుంది. ఈ నేపథ్యంలో తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చైనా ప్రభుత్వం లాక్‌డౌన్ అమలు పరుస్తోంది. కాగా ఇప్పటివరకూ చైనాలో మొత్తం 82,295 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒక్క వూహాన్ నగరంలోనే 50 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అలాగే 3,342 మంది కరోనాతో మరణించారు.

Read More: ‘రాజముద్ర’ను మార్చేసిన ఏపీ సీఎంవో.. కారణం అదేనా?