AP Coronavirus Cases : ఏపీ కరోనా బులెటిన్ విడుదల.. గత 24 గంటల్లో డబుల్ డిజిట్‌కు చేరిన కోవిడ్ కేసుల సంఖ్య..

|

Feb 08, 2021 | 9:36 PM

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 62 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,85,590కి చేరింది. ఇందులో 962 యాక్టివ్ కేసులు..

AP Coronavirus Cases : ఏపీ కరోనా బులెటిన్ విడుదల.. గత 24 గంటల్లో డబుల్ డిజిట్‌కు చేరిన కోవిడ్ కేసుల సంఖ్య..
Follow us on

AP Coronavirus Cases : ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 62 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,85,590కి చేరింది. ఇందులో 962 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,77,468 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా రాష్ట్రంలో ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు కోవిడ్‌తో 7160 మంది మరణించారు. ఇక నిన్న102 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 1,33,67,616 సాంపిల్స్‌ను పరీక్షించారు.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 1, చిత్తూరు 8, తూర్పుగోదావరి 8, గుంటూరు 7, కడప 9, కృష్ణా 10, కర్నూలు 5, నెల్లూరు 6, ప్రకాశం 1, శ్రీకాకుళం 2, విశాఖపట్నం 5, విజయనగరం 0, పశ్చిమ గోదావరి 0 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

ఇవి కూడా చదవండి :

AP Panchayat Elections Result : పల్లెల్లో పోలింగ్‌.. ఇంతకీ ఏ జిల్లాల్లో.. ఎన్ని మండలాల్లో ఎన్నికలు.. ఓ సారి చూద్దాం..
AP Panchayat Elections 2021: ఏపీ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల గుర్తులు ఇవే..!