AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ టెస్ట్ తరువాతే భర్తను ఇంట్లోకి అనుమతించిన భార్య..!

మూడు వారాల తరువాత ఆ భర్త ఇంటికొచ్చాడు. అయితే ఆ భార్య షాక్‌ ఇచ్చింది. ఆ టెస్ట్ చేయించుకుంటేనే ఇంట్లోకి రానిస్తానని ఖరాఖండిగా చెప్పేసింది. దీంతో మొత్తానికి దిగొచ్చిన ఆ భర్త టెస్ట్ చేయించుకున్నాడు. ఫలితాల్లో నెగిటివ్ రావడంతో ఆ తరువాత భర్తకు ఇంట్లోకి స్వాగతం పలికింది ఆ భార్య. అయితే ఆమె అలా చేయడం వెనుక మంచి ఉద్దేశ్యం ఉంది. దీంతో అందరూ ఆమెకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ నేపథ్యంలో గత […]

ఆ టెస్ట్ తరువాతే భర్తను ఇంట్లోకి అనుమతించిన భార్య..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 18, 2020 | 5:01 PM

Share

మూడు వారాల తరువాత ఆ భర్త ఇంటికొచ్చాడు. అయితే ఆ భార్య షాక్‌ ఇచ్చింది. ఆ టెస్ట్ చేయించుకుంటేనే ఇంట్లోకి రానిస్తానని ఖరాఖండిగా చెప్పేసింది. దీంతో మొత్తానికి దిగొచ్చిన ఆ భర్త టెస్ట్ చేయించుకున్నాడు. ఫలితాల్లో నెగిటివ్ రావడంతో ఆ తరువాత భర్తకు ఇంట్లోకి స్వాగతం పలికింది ఆ భార్య. అయితే ఆమె అలా చేయడం వెనుక మంచి ఉద్దేశ్యం ఉంది. దీంతో అందరూ ఆమెకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ నేపథ్యంలో గత నెలలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో కొంతమంది వేరే ప్రదేశాల్లో ఇరుక్కుపోయారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన ఓ వ్యక్తి నెల్లూరులో ఆగిపోయారు. అయితే మూడు వారాల తరువాత ఎలాగోలా తన సొంతూరికి చేరుకున్నారు. అయితే ఆయన భార్య అతడిని ఇంట్లోకి రానివ్వలేదు. కరోనా టెస్ట్ చేయించుకుంటూనే ఇంట్లోకి అనుమతిస్తానని తేల్చేసింది. అంతేకాదు తన భర్త వచ్చిన విషయం వాలంటీర్లు, అంగన్‌వాడీ సిబ్బందికి తెలిపి.. అతడికి పరీక్షలు చేయించాలంటూ పేర్కొంది. ఇక ఎట్టకేలకు భార్య బలవంతంతో ఆ భర్త కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అదృష్టవశాత్తు ఆ టెస్ట్‌లో అతడికి నెగిటివ్‌గా తేలడంతో.. ఆమె ఇంట్లోకి అనుమతించింది.

ఇక ఈ సంఘటన గురించి ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మన వల్ల మిగిలిన వారు ఇబ్బంది పడకూడదు. నా పిల్లలు, అలాగే మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వారి ప్రాణాలను నేను ఇబ్బందుల్లోకి నెట్టాలనుకోవడం లేదు. అందుకే కరోనా టెస్ట్ తరువాతనే నా భర్తను ఇంట్లోకి అనుమతించా అని పేర్కొన్నారు. కాగా కరోనాను అరికట్టేందుకు లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటించాలని.. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన నియమాలను పాటించాలని అధికారులు చెప్తూనే ఉన్నారు. కానీ వాటిని కొంతమంది చదువుకున్న వారు సైతం సరిగా పట్టించుకోలేదు. ఇలాంటి నేపథ్యంలో మరొకరి ప్రాణాలకు ఇబ్బంది కలగకుండా ఆ మహిళ తీసుకున్న నిర్ణయం నిజంగా అభినందనీయమే. కాగా ఈ వారంలో తెలంగాణాలోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. వేరే ప్రాంతం నుంచి వచ్చిన తన తల్లిని ఓ సర్పంచ్‌ ఇంట్లోకి అనుమతించలేదు.

Read This Story Also: ఎన్టీఆర్‌తో రూమార్ల వల్లే ఆ హీరోయిన్‌ టాలీవుడ్‌కు దూరమైందా..!