మహిళల్లోనే కరోనా మరణాలు అత్యధికం

గ్లోబల్‌ హెల్త్‌ సైన్సెస్‌ అధ్యయనం ప్రకారం.. మన దేశంలో కరోనా బారిన పడిన మహిళల్లో మరణాల శాతం అధికంగా ఉన్నట్లు తేలింది. మే 20వ తేదీ వరకు ఉన్న లెక్కల ప్రకారం కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన పురుషుల్లో 2.9% మరణాలు సంభవించగా మహిళల్లో అది 3.3% వరకు ఉన్నట్లు తేలింది.

మహిళల్లోనే కరోనా మరణాలు అత్యధికం

Edited By:

Updated on: Jun 14, 2020 | 7:45 AM

గ్లోబల్‌ హెల్త్‌ సైన్సెస్‌ అధ్యయనం ప్రకారం.. మన దేశంలో కరోనా బారిన పడిన మహిళల్లో మరణాల శాతం అధికంగా ఉన్నట్లు తేలింది. మే 20వ తేదీ వరకు ఉన్న లెక్కల ప్రకారం కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన పురుషుల్లో 2.9% మరణాలు సంభవించగా మహిళల్లో అది 3.3% వరకు ఉన్నట్లు తేలింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనివారు అత్యధిక మంది మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అక్కడ శనివారం వరకు సంభవించిన 365 మరణాల్లో దాదాపు 65% మంది 21-60 ఏళ్లలోపు వారేనని తేలింది.
దేశంలో కరోనా కేసుల గణాంకాలు దడ పుట్టిస్తున్నాయి. లక్ష నుంచి 2 లక్షలకు చేరడానికి 16 రోజులు పట్టగా, పది రోజుల్లోనే మరో లక్ష పెరిగి 3 లక్షలకు చేరాయి. రోజువారీ కేసులు 9 వేల నుంచి 10 వేలకు చేరడానికి 8 రోజులు పట్టగా, ఒక్కరోజులోనే 10 వేల నుంచి 11 వేలకు చేరాయి. దేశంలో ప్రతి పది లక్షల మందికి సగటున 6.48 మరణాలు సంభవిస్తున్నాయి. ఢిల్లీలో అత్యధికంగా 64.88 మంది కన్ను మూస్తున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (30.18), గుజరాత్‌ (22.17), మధ్యప్రదేశ్‌ (5.17), తమిళనాడు (4.71), పశ్చిమబెంగాల్‌ (4.53), తెలంగాణ (4.42) రాష్ట్రాలు ఉన్నాయి. కోలుకున్న వారి సంఖ్య గత 24 గంటల్లో 7135, మొత్తం 1,54,330. ఐసీఎంఆర్‌ తాజా లెక్కల ప్రకారం పరీక్షలు చేసిన వారిలో ప్రతి 17.82 మందిలో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. గత 24 గంటల్లో మాత్రం ప్రతి 12.5 మందిలో ఒకరికి వైరస్‌ సోకింది.