క‌రోనాపై నాగ్‌,చిరు పాట‌…నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్‌

తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంది. రెక్కాడితే గానా, డొక్కాడాని ఎంతో కార్మికులు, రోజువారి కూలీలు అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. వారిని ఆదుకునేందుకు ప్ర‌భుత్వాలు సహాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశాయి.ప్ర‌భుత్వాల‌కు అండ‌గా టాలీవుడ్ క‌దులుతోంది. తాజాగా...

క‌రోనాపై నాగ్‌,చిరు పాట‌...నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్‌
Follow us

|

Updated on: Mar 30, 2020 | 2:43 PM

కోవిడ్-19ః ప్రాణాంత‌క వైర‌స్ ప్ర‌పంచమంతా దావాల‌నంలా వ్యాపిస్తోంది. రోజు రోజుకి తీవ్ర రూపం దాల్చుతున్న నేప‌థ్యంలో ప్ర‌పంచ‌దేశాలు వ‌ణికిపోతున్నాయి. క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా ఇప్ప‌టికే మ‌న‌దేశంలో లాక్‌డౌన్ కొన‌సాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంది. దీంతో రెక్కాడితే గానా, డొక్కాడాని ఎంతో కార్మికులు, రోజువారి కూలీలు అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. వారిని ఆదుకునేందుకు ప్ర‌భుత్వాలు కూడా సహాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశాయి.

ప్ర‌భుత్వాల‌కు అండ‌గా టాలీవుడ్ క‌దులుతోంది. సినీ ప‌రిశ్ర‌మ‌కి చెందిన సెల‌బ్రిటీలు భారీ విరాళాలు ఇస్తున్నారు. మ‌రోవైపు ప్ర‌జ‌ల‌ని చైత‌న్యం చేసేలా ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. తాజాగా సంగీత ద‌ర్శ‌కుడు కోటీ ఓ పాట‌ను రూపొందించ‌గా, చిరంజీవి, నాగార్జున‌, వ‌రుణ్ తేజ్, సాయిధ‌ర‌మ్ తేజ్ పాలుపంచుకున్నారు. క‌రోనా నుండి అప్ర‌మ‌త్తంగా ఎలా ఉండాల‌ని వారు పాడిన ఈ పాట నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్ సమయంలో సినీ కార్మికులను ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో తెలుగు సినీ పరిశ్రమ ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ (సీసీసీ)ని ఏర్పాటుచేసింది. ఈ సంస్థకి చైర్మన్‌గా చిరంజీవి ఉన్నారు. ఈ ఛారిటీకి సినీ ప్రముఖుల నుంచి భారీగా విరాళాలు అందుతున్నాయి. ఇప్పటికే పలువురు నటులు సీసీసీకి విరాళాలు ప్రకటించగా.. తాజాగా హీరో ప్రభాస్‌ రూ.50 లక్షలు, నటుడు బ్రహ్మాజీ రూ.75 వేలు విరాళం ప్ర‌క‌టించారు.