బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ఇంట కరోనా కలకలం..

|

Jun 30, 2020 | 3:42 PM

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరూ కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ స్టాఫ్‌లో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ఇంట కరోనా కలకలం..
Follow us on

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా.. పోలీసుల నుంచి పొలిటికల్ లీడర్స్ వరకు అందరూ కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ స్టాఫ్‌లో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో అమీర్‌తో పాటుగా ఆయన తల్లి, అతనితో అసోసియేట్ అయిన వారందరికీ టెస్టులు నిర్వహించారు.  పరీక్షల్లో అమీర్ ఖాన్‌కు కరోనా నెగటివ్ రాగా.. ఆయన తల్లికి సంబంధించిన టెస్ట్ రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉన్నాయి. ఆమెకు నెగ‌టివ్ రావాల‌ని.. ప్రార్థించ‌మ‌ని అభిమానులను ఆమీర్ కోరారు.

కరోనా అని తేలడంతో హీరో సహాయకులను ఆసుపత్రికి తరలించారు. అమీర్ ఖాన్ కుటుంబం హోం క్వారంటైన్‌కి వెళ్లింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా స్పందించిన అమీర్ ఖాన్.. తాము అంతా క్షేమంగా ఉన్నామని అభిమానులకు సందేశం ఇచ్చారు. క‌రోనా టెస్టుల విష‌యంలో త్వరగా స్పందించిన బీఎంసీ ప‌నితీరును అమీర్ మెచ్చుకున్నారు.